ఏదేమైనా తన కొడుకు ఇంత పెద్ద హిట్టు కొట్టాడంటే.. దానికి ఫుల్ హ్యాపీ అంటున్నారు అల్లు అరవింద్. ''సరైనోడు'' సినిమా భారీగా సక్సెస్ అయిన సందర్భంలో ఈరోజు ఆయన గీతా ఆర్ట్స్ ఆఫీస్ కు మీడియాను పిలిపించి థ్యాంక్స్ చెప్పారు. అయితే ఈ సినిమా హిట్టవ్వడానికి ప్రధాన కారణం ఏంటో కూడా చెప్పుకొచ్చారు.
''నిజానికి ఈ సినిమా ఇంతగా హిట్టవ్వడానికి కేవలం జనాలే కారణం. బన్నీకి.. బోయపాటి గారికి.. గతంలో బోలెడన్ని హిట్లున్నాయి. కాని ఈ రేంజు హిట్టు ఎప్పుడూ దక్కలేదు. కేవలం జనాలు సినిమా చూసి అద్భుతమైన మౌత్ టాక్ స్ర్పెడ్ చేయడం వలనే ఇంత కలక్షన్లు వచ్చాయి. అందుకు జనాలకు నేను శిరస్సాభివందనం చేస్తున్నా'' అంటూ సెలవిచ్చారు అరవింద్. అంతేకాదు.. ఈ సినిమాతో ఎందుకు ఫుల్ హ్యాపీగా ఉన్నారో కూడా చెప్పుకొచ్చారు. ''మామూలుగా సినిమాల వసూళ్ళను రికార్డులుగా చూసేవారం. ఇప్పుడు మాత్రం ఏ హీరో ఎన్నిసార్లు 100 కోట్ల క్లబ్ లోకి వెళ్ళాడు అనే ఒరవడిని ఒక రికార్డుగా చూస్తున్నాం. అలా చూసుకుంటే.. బన్నీ రెండోసారి ఈ 100 కోట్ల (గ్రాస్) క్లబ్ లోకి వెళ్లడం తండ్రిగా నాకు చాలా ఆనందంగా ఉంది'' అంటూ పుత్రోత్సాహం చూపించారు అరవింద్.
మే 20 వరకు ఒక్క పెద్ద సినిమా కూడా లేకపోవడంతో.. బన్నీ ఇంకా బాక్సాఫీస్ దగ్గర తన ''సరైనోడు'' ప్రభంజనం చూపిస్తూనే ఉన్నాడు.