అల్లు అర‌వింద్ కావాల‌నే అలా ప్ర‌క‌టించారా?

Update: 2022-10-22 09:30 GMT
అల్లు అర‌వింద్ .. ఇండ‌స్ట్రీలో ఎంత మంది స్టార్ ప్రొడ్యూస‌ర్స్ వున్న ఈయ‌న పంథా ప్ర‌త్యేకం. అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేస్తూ నిర్మాత‌గా ఇండ‌స్ట్రీ వ‌ర్గాల చేత‌ మాస్ట‌ర్ మైండ్ అనిపించుకున్నారు. ఇటీవ‌ల యంగ్ ప్రొడ్యూస‌ర్ బ‌న్నీ వాసుతో క‌లిసి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాల‌ని నిర్మిస్తున్నఆయ‌న డిస్ట్రిబ్యూట‌ర్ గానూ అద్భుతాలు సృస్టిస్తున్నారు. దానికి రీసెంట్ గా గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూష‌న్ లో రిలీజ్ చేసిన క‌న్న‌డ అనువాద మూవీ `కాంతార‌` చ‌క్క‌ని ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తోంది.

ఇదిలా వుంటే అల్లు అర‌వింద్ తన చిన్న కుమారుడు అల్లు శిరీష్ తో `ఊర్వ‌శీవో రాక్ష‌సివో` అనే రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ ని యంగ్ ప్రొడ్యూస‌ర్ తో క‌లిసి నిర్మించారు. శిరీష్ దాదాపు రెండున్న‌రేళ్ల విరామం త‌రువాత చేసిన సినిమా ఇది. రాకేష్ శ‌శి ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా న‌టించింది.  రీసెంట్ గా విడుద‌ల చేసిన టీజ‌ర్ సినిమాపై అంచ‌నాల్ని పెంచేసింది. అంతే కాకుండా అల్లు శిరీష్‌, అను ఇమ్మాన్యుయేల్ ల మ‌ధ్య మంచి కెమిస్ట్రి కుదిరిన‌ట్టుగా టీజ‌ర్ లో చూపించిన లిప్ లాక్ స‌న్నివేశాలు స్ప‌ష్టం చేస్తున్నాయి.

దీంతో యూత్ ని టార్గెట్ చేస్తూ తెర‌కెక్కిన ఈ మూవీపై మంచి బ‌జ్ క్రియేట్ అయింది. దాన్ని మ‌రింత‌గా పెంచే ప్ర‌య‌త్నం చేస్తున్నారు మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్‌. న‌వంబ‌ర్ 4న రిలీజ్ కానున్న ఈ మూవీకి సంబంధించిన ప్ర‌మోష‌న్స్ ని ఇప్ప‌టికే మొద‌లు పెట్టించిన అల్లు అర‌వింద్ త్వ‌ర‌లో ఈ మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని భారీగా నిర్వ‌హించాల‌ని ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్ కి స్పెష‌ల్‌, అండ్ యునిక్ పెర్స‌న్ అటెండ్ అవుతున్న‌ట్టుగా ప్ర‌క‌టించి స‌ర్ ప్రైజ్ చేశారు.

మెగా కాంపౌండ్ హీరోల ఫంక్ష‌న్ ల‌కు ప్ర‌ధానంగా ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యేది మెగాస్టార్ చిరంజీవి, లేదా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. అది అంద‌రికి తెలిసిందే. అయితే ఈ సారి అల్లు శిరీష్ మూవీ ప్రీ రిలీజ్ వేడుక‌లో యునిక్ అండ్ స్పెష‌ల్ రాబోతున్నారంటూ అల్లు అర‌వింద్ ప్ర‌క‌టించ‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. యునిక్ , స్పెష‌ల్ అంటే నంద‌మూరి బాల‌య్య అన్న‌మాటే క‌దా?.. అని అంతా అంటున్నారు. మ‌రీ ఇంత స్పెష‌ల్ , యునిక్ అని బాల‌య్య‌ని ఆహ్వానిస్తే మెగా ఫ్యాన్స్ ఏమంటారో.. ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే అనే కామెంట్ లు వినిపిస్తున్నాయి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News