టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్ - టాప్ ప్రొడ్యూసర్స్ అనగానే ఠక్కున వినిపించే పేర్లలో అల్లు అరవింద్ పేరు ముందు వరుసలో ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎన్నో పెద్ద చిత్రాలను నిర్మించిన అల్లు అరవింద్ పలు సూపర్ హిట్ చిత్రాలను అందుకున్నాడు. అయితే ఇప్పుడు పెద్ద సినిమాలను ఎక్కువ నిర్మించే సాహసం చేయడం లేదు. ఒకటి రెండు సినిమాలు తలకిందు అయితే మొత్తం అస్థవ్యస్థం అవుతుంది. అందుకే అల్లు అరవింద్ వెనుక ఉండి బన్నీ వాసు - ఎస్ కే ఎన్ వంటి వారితో చిన్న చిత్రాలు నిర్మింపజేస్తున్నాడు.
గీతా ఆర్ట్స్ 2 సంస్థను ప్రారంభించిన అల్లు అరవింద్ ఇప్పటి వరకు స్వయంగా రంగంలోకి దిగకుండా బన్నీ వాసును ముందు నడిపిస్తున్నాడు. తాను మాత్రం సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. చిన్న సినిమాల విషయంలో ఇన్నాళ్లు పెద్దగా పట్టించుకోకుండా ఉన్న అల్లు అరవింద్ ఇకపై చిన్న చిత్రాలను స్వయంగా తానే నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. గతంలో అశ్వినీదత్ తో కలిసి పలు చిన్న చిత్రాలను నిర్మించిన అల్లు అరవింద్ మరోసారి అలాంటి ప్రయోగాలను చేసేందుకు సిద్దం అవుతున్నాడు.
ప్రస్తుతం కాన్సెప్ట్ ను వింటున్న అల్లు అరవింద్ త్వరలోనే కొత్త వారితో ఒకటి లేదా రెండు సినిమాలను బ్యాక్ టు బ్యాక్ ప్రారంభించే అవకాశం కనిపిస్తోంది. తక్కువ బడ్జెట్ తో సినిమాలు నిర్మించడం వల్ల మంచి లాభాలు దక్కించుకోవచ్చు అనేది ఈమద్య పలు సినిమాలతో నిరూపితం అయ్యింది. అందుకే అల్లు అరవింద్ స్వయంగా రంగంలోకి దిగి ప్రయోగాలు చేయాలని భావిస్తున్నాడు. మరి ఇప్పుడు బన్నీ వాసు, ఎస్ కే ఎన్ ఏం చేస్తారో చూడాలి. వీరు సొంత బ్యానర్ లు ఏమైనా ప్రారంభిస్తారా లేదంటే గీతా ఆర్ట్స్ 2 లోనే సినిమాలకు ప్లాన్ చేస్తారో కాలమే నిర్ణయిస్తుంది.