అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మాతగా జీఏ2 పిక్చర్స్ బ్యానర్ లో తెరకెక్కిన చిత్రం ‘గీతాగోవిందం’. ఆగస్టు15న విడుదలవుతున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుక విశాఖపట్నంలో ఆదివారం రాత్రి ఘనంగా జరిగింది. ఇటీవలే ‘గీతాగోవిందం’ పైరసీ బారిన పడింది. కారకులపై ఫిర్యాదు మేరకు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాలపై వేడుకలో అల్లు అరవింద్ ప్రస్తావించి షాకింగ్ కామెంట్స్ చేశాడు.
అల్లు అరవింద్ మాట్లాడుతూ ‘పైరసీ చేసే వాళ్లకు ఒకటే చెబుతున్నాను.. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ చేతుల్లో తన్నులు తినొద్దు’ అంటూ హెచ్చరించారు. పైరసీదారులను పట్టుకొని కొట్టడం అని విజయ్ ఫ్యాన్స్ కు తాను పిలుపునివ్వడం లేదని.. కానీ ఆ అవకాశానికి మాత్రం తెచ్చుకోవద్దని పైరసీదారులకు అల్లు అరవింద్ స్పష్టం చేశారు. పోలీసులకు ఇప్పటికే ఫిర్యాదు చేశామని.. వారు మీపై చర్య తీసుకుంటారని వెల్లడించారు.
‘మా సినిమా గీతాగోవిందమే కాదు.. మరో మూడు సినిమాలు కూడా లీకయ్యాయని తెలిసి చాలా బాధపడ్డాను.. ఎవరు పైరసీ చేసిన ఐపీ అడ్రస్ తో ఇట్టే కనుక్కునే టెక్నిక్స్ వచ్చేశాయి. ’ అని అల్లు అరవింద్ హెచ్చరికలు పంపారు. ఇలాంటి జరగడం ఇండస్ట్రీలో చాలా సిగ్గు పడాల్సిన విషయమని.. ఈ లీక్ తెలిసి చాలా బాధపడ్డానని ఆవేదన వ్యక్తం చేశారు.
మరో రెండు రోజుల్లో విడుదలవుతున్న తమ సినిమాకు ఈ లీకులు పెద్ద నష్టం కాదని అరవింద్ చెప్పుకొచ్చారు. కానీ పెద్ద సినిమాల క్లిప్పింగ్స్ కూడా లీకవుతున్నాయని తెలిసి భయమేస్తోంది. మీకు వార్నింగ్ ఇస్తున్నా.. దయచేసి ఇలాంటి చేయకండని అరవింద్ కోరారు.
విజయ్ దేవరకొండను చూస్తే మూడు నాలుగు - సినిమాలు చేసి సైడ్ అయిపోతాడని అనుకుంటున్నారని.. కానీ అతడు వంద సినిమాలు ఖచ్చితంగా చేస్తాడని అల్లు అరవింద్ ధీమా వ్యక్తం చేశారు. విజయ్ మామూలు నటుడు కాదని.. మంచి స్పాన్ ఉన్న నటుడు.. త్వరలోనే అగ్రహీరోగా ఎదిగే రోజు దగ్గరలోనే ఉందని అవరింద్ చెప్పుకొచ్చారు. కాల్షీట్ల సమస్యతో హీరోయిన్ కోసం మూడు నెలలు సినిమా ఆపేశామని.. ఆమె ఈ సినిమాలో చించేసిందని తెలిపాడు.