నందమూరి బాలకృష్ణ వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి ఆడియో ఫంక్షన్ సందర్భంగా.. ఖబడ్దార్ సంక్రాంతికి వస్తున్నాం అనే కామెంట్ వినిపించింది. ఇది ఖైదీ నంబర్ 150ని ఉద్దేశించినదే అని మెగా ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. అయితే.. తాను మెగాస్టార్ కు అభిమానిని అని.. తెలుగువారిని తక్కువ చేసి మాట్లాడేవారినే అన్నానని క్రిష్ వివరణ కూడా ఇచ్చాడు.
దీంతో ఈ వివాదం సద్దుమణుగుతుందని అనుకుంటే.. రీసెంట్ గా వైజాగ్ లో బన్నీ చేసిన ఓ కామెంట్ మళ్లీ వివాదం మొదలు పెట్టింది. ఓ బ్రాండ్ కు ప్రచారం చేయడం కోసం విశాఖ వెళ్లిన బన్నీ.. అక్కడ ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. 'ఈ సంక్రాంతి మనదే' అన్నాడు. పండుగకు వస్తున్నాం హిట్ కొడుతున్నాం అనే యాంగిల్ లో బన్నీ అని ఉండొచ్చు కానీ.. 'ఖబడ్దార్ కు మెగా టీం నుంచి వచ్చిన రియాక్షన్ ఇది' అనే విశ్లేషణలు మొదలైపోయాయి.
తన దగ్గరకు వచ్చిన ఓ అభిమానిని సంతృప్తి పరచడానికి.. సమాధానపరచడానికి బన్నీ చేసిన చిన్న కామెంట్ మాత్రమే.. ఈ సంక్రాంతి మనదే. అలాగే క్రిష్ కూడా డీటైల్డ్ గా తన ఖబడ్దార్ వెనక అర్ధం వివరించాడు. అయినా సరే సోషల్ మీడియాలో ఈ ఫ్యాన్స్ రచ్చ కొనసాగుతుండడం ఆశ్చర్యకరమే. అభిమానం అవధులు దాటి ట్రాలింగ్ స్టేజ్ కి వచ్చేయడంతోనే ఇలాంటి హంగామాలు.. వివాదాలు ఎక్కువైపోతున్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/