డ్రైవర్ ఇల్లు కోసం బన్నీ సహాయం

Update: 2022-11-11 14:30 GMT
పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు సెకండ్ పార్ట్ తో కూడా అంతకుమించి హిట్ అందుకోవాలని రెడీ అవుతున్నాడు. అయితే అల్లు అర్జున్ ఒక స్టార్ హీరోగా మాత్రమే కాకుండా పర్సనల్ లైఫ్ లో కూడా ఒక మంచి వ్యక్తిగా కొనసాగుతూ వస్తున్నాడు. అతను ఒక మంచి ఫ్యామిలీ మెన్ అని కూడా అందరికీ తెలిసిన విషయమే.

ఇక తన దగ్గర వర్క్ చేసే ప్రతి ఒక్కరికి కూడా అల్లు అర్జున్ ఎంతో సపోర్ట్ గా ఉంటాడు అని చాలాసార్లు రుజువైంది. ప్రస్తుతం నిర్మాతగా కొనసాగుతున్న బన్నీ వాసు కూడా అల్లు అర్జున్ సపోర్ట్ తో ఇండస్ట్రీలో ఒక గుర్తింపును అందుకున్నాడు. అదే తరహాలో బన్నీ మద్దతుతో సక్సెస్ అయిన వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. నాతో వచ్చేవారు కూడా మరొక మెట్టు ఎదగాలని నేను కోరుకుంటాను అని అల్లు అర్జున్ గతంలో చాలాసార్లు సినిమా ఈవెంట్స్ లలో తెలియజేశారు.

అయితే ఆఖరికి బన్నీ తన దగ్గర ఎంతో నమ్మకంగా వర్క్ చేసే డ్రైవర్ కు కూడా మద్దతు ఇవ్వడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాదాపు 10 ఏళ్లుగా తన దగ్గరే డ్రైవర్గా కొనసాగుతున్న వ్యక్తికి ఇల్లు కట్టుకోవడానికి కొంత డబ్బు సహాయం చేసినట్లుగా తెలుస్తోంది. వరంగల్ కు చెందిన మహిపాల్ గత 10 ఏళ్లుగా బన్నీ దగ్గర డ్రైవర్ వర్క్ చేస్తున్నాడు.

ఇక బోరాబండలో అతను ఇల్లు కట్టుకుంటూ ఉండగా బన్నీ అతనికి 15 లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం చేశాడు. బన్నీ మంచి మనసు ఏమిటో మరోసారి అర్థమైంది. అందుకు సంబంధించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక పుష్ప 2 సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైన విషయం తెలిసిందే. త్వరలోనే ఆ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేయబోతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News