స్టార్ డైరెక్టర్ డెన్ లోకి ఆయనా కాలు పెడుతున్నాడా?
కోలీవుడ్ సంచలనం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో నటించడానికే స్టార్ హీరోలే క్యూలో ఉన్నారు.
కోలీవుడ్ సంచలనం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో నటించడానికే స్టార్ హీరోలే క్యూలో ఉన్నారు. `ఖైదీ`, `విక్రమ్`, `లియో` చిత్రాలతో పాన్ ఇండియాలో సంచనలం అవ్వడంతో లోకేష్ డిమాండ్ పెరిగిపోయింది. ఆ విజయాలు చూసే సూపర్ స్టార్ రజినీకాంత్ పిలిచి మరీ అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం ఆ కాంబినేషన్ లో `కూలీ` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అలాగే కమల్ హాసన్ లోకేష్ తో మరిన్ని చిత్రాలు పనిచేయడానికి ఆసక్తిగా ఉన్నారు.
రాజ్ కమల్ ఫిలింస్ పై లోకేష్ స్క్రిప్ట్ లను సైతం నిర్మించడానికి ఉలగనాయగన్ రెడీగా ఉన్నారు. ఇక టాలీవుడ్ నుంచి చూస్తే ఇక్కడి స్టార్ హీరోలు సైతం రెడీ అంటూ ముందుకొస్తున్నారు. ఇటీవలే నాగచైతన్య కూడా ఎల్ సీయూలో ఛాన్స్ ఉంటే కల్పించమని రిక్వెస్ట్ సైతం చేసారు. ఇలా లోకేష్ కనగరాజ్ డిమాండ్ అంతకంతకు పెరిగిపోతుంది. కానీ ఆయన మాత్రం సెలక్టివ్ గా సినిమాలు చేస్తున్నాడు. `కూలీ` తర్వాత కార్తీ తో `ఖైదీ -2` పట్టాలెక్కిస్తాడు.
అటుపై `రోలెక్స్` సహా ఎల్ సీ యూ నుంచి మరిన్ని సినిమాలొస్తాయి. దాదాపు ఆరేళ్ల పాటు గన్స్ లేకుండా సినిమా తీయనని ప్రకటించేసాడు కాబట్టి! లోకేష్ నుంచి కొత్త జోనర్ ఆశించాల్సిన పనిలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ధనుష్ తో కూడా లోకేష్ ఓ సినిమా చేస్తున్నాడనే వార్త కోలీవుడ్ మీడియాలో ప్రచారంలోకి వస్తోంది. ఇటీవలే ధనుష్ కి స్టోరీ వినిపించడాని..నచ్చడంతో ఒకే చేసినట్లు వినిపిస్తోంది. మరి ఈ సినిమా పట్టాలెక్కేది ఎప్పుడు? అంటే ప్రత్యేకించి చెప్పలేని పరిస్థితి.
ఇద్దరు ఒకే అనుకుంటే ప్రారంభోత్సవం పెద్ద విషయం కాదు. `ఖైదీ-2` తర్వాత లోకేష్ ధనుష్ కోసం రంగంలోకి దిగినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఎందుకంటే ఎల్ సీ యూకి ఎలాగూ హీరోలు కావాలి. అందులో ఓ స్టోరీ ధనుష్ కోసం తీస్తే సరి. ధనుష్ లాంటి నటుడితో లోకేష్ సినిమా అతడి కెరీర్ కి కలిసొచ్చేదే.