సూపర్ స్టార్ ఫ్యాన్స్.. ఇంత నమ్మకం ఏంటో..?
రాజమౌళి సినిమా చేస్తున్న హంగామా ఎక్కడ కనిపించట్లేదు. సైలెంట్ గా షూట్ చేస్తున్నారనే టాక్ ఉన్నా సినిమాకు హై తెచ్చేలా రాజమౌళి ఎలాంటి క్లూస్ ఇవ్వట్లేదు.;
సెట్స్ మీద ఉన్న స్టార్ సినిమా నుంచి ఎలాంటి లీక్స్ రాకుండా జాగ్రత్తపడుతుంటారు. ఇక రాజమౌళి లాంటి డైరెక్టర్ అయితే స్ట్రిక్ట్ కండీషన్స్ తో ఈ రూల్స్ పాటిస్తాడు. సూపర్ స్టార్ మహేష్ తో రాజమౌళి చేస్తున్న సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఒడిశాలో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ నుంచి ఒక క్లిప్ సోషల్ మీడియాలో లీక్ అయ్యింది. మహేష్ అలా నడుచుకుంటూ వస్తుంటే ఒకరు వచ్చి నెడుతుంటాడు.. అలా నెట్టుకుంటూ వచ్చి ఒకతని ముందు మోకాళ్ల మీద కూర్చుంటాడు.
ఐతే ఆ సీన్ చూస్తే రాజమౌళి సినిమా కోసం చేస్తున్న సీన్ లా అనిపించలేదు. సినిమా షూటింగ్ నుంచి లీకైన వీడియోనే కానీ రాజమౌళి అంత భారీ బడ్జెట్ తో చేస్తున్న సినిమా ఫీల్ అయితే దానికి రాలేదు. మహేష్ రాజమౌళి సినిమా దగ్గర దగ్గర 1000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతుందని టాక్. అలాంటి సినిమాలో అలా నాసిరకం సీన్ ఉంటుందని సూపర్ స్టార్ ఫ్యాన్స్ అనుకోవట్లేదు.
ఈ వీడియో లీకేజీ మ్యాటర్ ఏమో తెలియదు కానీ జక్కన్న షూటింగ్ చేస్తున్న విధానం ఫ్యాన్స్ కు అంతు చిక్కట్లేదు. రాజమౌళి సినిమా చేస్తున్న హంగామా ఎక్కడ కనిపించట్లేదు. సైలెంట్ గా షూట్ చేస్తున్నారనే టాక్ ఉన్నా సినిమాకు హై తెచ్చేలా రాజమౌళి ఎలాంటి క్లూస్ ఇవ్వట్లేదు. మరి అసలు రాజమౌళి ప్లాన్ ఏంటి ఆయన మహేష్ 29 సినిమా గురించి ఏం ఆలోచిస్తున్నాడు అన్నది తెలియాల్సి ఉంది.
ఆఫ్రికా అడవుల్లో షూటింగ్ చేస్తారన్న టాక్ వినిపిస్తున్నా అది ఎప్పుడన్నది క్లారిటీ రావట్లేదు. మహేష్ సినిమా జక్కన్న ప్లాన్ ఏంటి.. సినిమాకు ముందు ఇదివరకు ప్రెస్ మీట్ పెట్టి సెట్స్ మీదకు వెళ్లే రాజమౌళి మహేష్ సినిమాకు ఎందుకు అలా చేయలేదు. ఇలాంటి డౌట్లు చాలానే ఉన్నాయి. మహేష్ రాజమౌళి ఇద్దరు స్టార్ కాంబోలో చేస్తున్న ఈ సినిమాపై అంచనాలైతే ఆకాశాన్ని అంటేలా ఉన్నాయి. కానీ సినిమా గురించి అప్డేట్స్ మాత్రం అసలు రావట్లేదు.
మరి ఈ సినిమా గురించి వీడియో లీక్స్, గాసిప్స్ ఇవన్నీ ఫుల్ స్టాప్ పడాలంటే మాత్రం సినిమా గురించి రాజమౌళి ప్రెస్ మీట్ పెట్టాలని ఆశిస్తున్నారు. ఎస్.ఎస్.ఎం.బి 29 లీకైన వీడియోపై సూపర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం ఆ వీడియోలో ఏం లేదు. అయినా జక్కన్న సినిమా గురించి అంత కంగారు పడాల్సిన అవసరం లేదని రిలాక్స్ అవుతున్నారు.