ప్రభాస్.. మళ్ళీ జక్కన్న లాంటి రాక్షసుడితో..

ప్రభాస్ – సందీప్ వంగా కాంబినేషన్ అనగానే ఇది కేవలం ఓ సినిమా కాదని, ఒక సెన్సేషన్ అని అభిమానులు భావిస్తున్నారు.;

Update: 2025-03-11 11:30 GMT

ప్రభాస్ – సందీప్ వంగా కాంబినేషన్ అనగానే ఇది కేవలం ఓ సినిమా కాదని, ఒక సెన్సేషన్ అని అభిమానులు భావిస్తున్నారు. ‘ఆర్జీవీ’ తర్వాత భారతీయ సినీ ఇండస్ట్రీలో మళ్ళీ అలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసిన తెలుగు దర్శకుల లిస్టులో చేరిన సందీప్ వంగా, ఇప్పుడు ప్రభాస్‌తో కలిసి ‘స్పిరిట్’ పేరుతో భారీ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమయ్యే సమయానికి ముందు నుంచే ఆసక్తికరమైన చర్చలు మొదలయ్యాయి. చూస్తుంటే దాదాపు రాజమౌళి రేంజ్ లో కష్టపడే పని రాక్షసుడు సందీప్ వంగా. దీంతో బాహుబలికి బాగా కష్టపడినా ప్రభాస్ ఆ తరువాత తనకు కంఫర్ట్స్ గా ఉండేలా దర్శకులతో వర్క్ చేస్తున్నాడు.

ఆడుతూ పాడుతూ అప్పుడప్పుడు హాలిడేస్ ను ఎంజాయ్ చేసే ప్రభాస్ కు ఇప్పుడు సందీప్ వంగా మళ్ళీ రాజమౌళి ని గుర్తు చేసేలా ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా స్పిరిట్ ప్రాజెక్ట్‌ కోసం ప్రభాస్‌కు కొన్ని కఠినమైన షరతులు విధించినట్లు సమాచారం. సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలవ్వాల్సి ఉన్నా, ప్లాన్ సిద్దమవ్వడానికి కొంత సమయం పట్టింది. అయితే, వంగాకు ఇది ఓ చాన్స్ కాదు, ఒక గేమ్ ఛేంజర్.

ఇప్పటికే ‘యానిమల్’తో దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన అతను, ‘స్పిరిట్’ను మరో స్థాయికి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నాడు. అందుకే, ప్రభాస్ నుండి స్పెషిఫిక్ కమిట్‌మెంట్ కోరినట్లు తెలుస్తోంది. షూటింగ్ ఆలస్యం కాకుండా, జూన్ నుంచే మొదలుకావాలని డిమాండ్ చేశారట. ఎందుకంటే సినిమా సంక్రాంతి టార్గెట్‌గా ప్లాన్ అవుతోందని తెలుస్తోంది. ఇకపోతే, రెగ్యులర్‌గా హీరోలు తమ సినిమాల మధ్య విరామాలు తీసుకుంటుంటారు. కానీ, సందీప్ వంగా మాత్రం 65 రోజులు బ్యాక్ టూ బ్యాక్ షూటింగ్ చేయాలని కోరినట్లు తెలుస్తోంది.

బాహుబలి అనంతరం ఏ దర్శకుడు నాన్ స్టాప్ గా ప్రభాస్ ను ఎక్కువ రోజులు బ్లాక్ చేయడం లేదు, కానీ ఈ సినిమా విషయంలో దర్శకుడు పూర్తి డెడికేషన్ కావాలనే ఉద్దేశ్యంతో ఇలా డిమాండ్ చేసారట. హను రాఘవపూడి సినిమా, కల్కి 2898 AD 2’లాంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్స్‌ లైన్ లో ఉన్నప్పటికీ, ప్రభాస్ ఈ షరతులను ఒప్పుకుంటారా అనేది ఆసక్తికరం. మరో ఆసక్తికరమైన అంశం, హీరోలకు సంబంధించిన స్టంట్ షాట్ల గురించి. టాలీవుడ్‌లో బాడీ డబుల్స్ ఉపయోగించడం సాధారణంగా మారిపోయింది.

కానీ, సందీప్ వంగా మాత్రం ప్రభాస్‌కు వీలైనంత వరకు స్టంట్ సన్నివేశాల్లో డూప్ వద్దని స్పష్టంగా చెప్పినట్లు వినిపిస్తోంది. ప్రతి షాట్‌లోను ప్రభాస్ స్వయంగా నటించాలనే గట్టి నిబంధన విధించినట్లు సమాచారం. ఇది ప్రభాస్‌కు కొత్తగా ఏమీలేకపోయినా, వరుస సినిమాలతో ఒత్తిడిలో ఉన్న సమయంలో ఇలా పూర్తిగా యాక్షన్ సన్నివేశాలకు డెడికేట్ అవ్వడం కొంత కష్టతరమే. ఈ సినిమా కేవలం కమర్షియల్ ఎంటర్‌టైనర్ మాత్రమే కాకుండా, ప్రభాస్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందని అభిమానులు భావిస్తున్నారు.

వంగా స్క్రిప్ట్ ఎప్పుడూ మాస్ ఎలిమెంట్స్‌తో పాటు ఎమోషనల్ ఇంటెన్సిటీకి ప్రాధాన్యత ఇస్తుంది. అదే ‘స్పిరిట్’లో కూడా కనిపిస్తుందని టాక్. బాక్సాఫీస్ రికార్డులు క్రియేట్ చేయాలన్న తాపత్రయం ఉన్న దర్శకుడు, తన విజన్‌ను ఫుల్ ఫిల్టర్ చేయించుకునేందుకు ప్రభాస్‌ను పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ చేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ప్రభాస్ కెరీర్‌లో పలు ప్రయోగాలు జరిగాయి. కానీ, ‘స్పిరిట్’ మిగిలిన వాటి కంటే భిన్నంగా ఉండబోతోందని టాక్.

Tags:    

Similar News