దువ్వాడపై కోసం పోలీసులు రెడీ.. గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే అరెస్టు!

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అరెస్టుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై దువ్వాడ అనుచిత వ్యాఖ్యలు చేశారని రాష్ట్రవ్యాప్తంగా కేసులు నమోదువుతున్నాయి.;

Update: 2025-03-11 14:30 GMT

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అరెస్టుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై దువ్వాడ అనుచిత వ్యాఖ్యలు చేశారని రాష్ట్రవ్యాప్తంగా కేసులు నమోదువుతున్నాయి. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే దువ్వాడను అరెస్టు చేసే అవకాశం ఉందని అంటున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ దువ్వాడ పరుష పదజాలంతో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంటారని చెబుతున్నారు. గత ప్రభుత్వంలో ఆయన నోటికి అడ్డూ అదుపు ఉండేదికాదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఆయనను ఎప్పుడైనా అరెస్టు చేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయిజ

వైసీపీ నేతలు వల్లభనేని వంశీ, పోసాని క్రిష్ణమురళి మార్గంలోనే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ను అరెస్టు చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఆయన రాష్ట్రవ్యాప్తంగా ఐదు కేసులు నమోదయ్యాయి. భీమవరం, అవనిగడ్డ, మచిలీపట్నం, కోనసీమ, గుంటూరు పోలీసుస్టేషన్లలో దువ్వాడ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ జనసేన కార్యకర్తలు ఫిర్యాదులు చేశారు.

అసెంబ్లీ సమావేశాలు సందర్భంగా డిప్యూటీ సీఎం వపన్ కల్యాణ్ రోజుకు రూ.50 కోట్లు తీసుకొంటున్నారని ఎమ్మెల్సీ దువ్వాడ సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశ్నించకుండా ఉండేందుకు డిప్యూటీ సీఎం పవన్ కు భారీ మొత్తంలో డబ్బు అందుతోందని ఎమ్మెల్సీ ఆరోపించడం చర్చనీయాంశమైంది. దువ్వాడ నిరాధార ప్రకటనపై జనసైనికులు ఫైర్ అవుతున్నారు. అంతేకాకుండా ఎన్నికలకు ముందు కూడా పవన్ కుటుంబంపైనా, ఆయన వ్యక్తిత్వంపైన దువ్వాడ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తాజాగా కేసులు నమోదు చేస్తున్నారు. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే శ్రీకాకుళం జిల్లాలోనూ కొన్ని కేసులు నమోదయ్యాయి. తాజాగా గోదావరి జిల్లాలతోపాటు క్రిష్ణా డెల్టాలోనూ దువ్వాడపై ఫిర్యాదులు రావడంతో త్వరలో ఆయన పోలీసు టూర్ వేస్తారంటూ టీడీపీ కార్యకర్తలు విమర్శిస్తున్నారు.

Tags:    

Similar News