'కంగువ‌'పై మీడియా అన్యాయంగా.. జ్యోతిక ఆవేదన‌!

ఇదే జాన‌ర్ లో వ‌చ్చిన కొన్ని చెత్త సినిమాల‌ను విమ‌ర్శించ‌ని క్రిటిక్స్ త‌న‌ భ‌ర్త సూర్య న‌టించిన కంగువ‌ను మాత్రం దారుణంగా విమ‌ర్శించార‌ని, ఒక వ‌ర్గం మీడియా ప‌ని ఇద‌ని వాపోయారు జ్యోతిక‌.;

Update: 2025-03-11 15:30 GMT

త‌మిళ స్టార్ హీరో సూర్య‌ను త‌న భార్య జ్యోతిక వెన‌కేసుకొచ్చారు. అత‌డు న‌టించిన పాన్ ఇండియ‌న్ సినిమా 'కంగువ'ను కొంద‌రు టార్గెట్ చేసార‌ని వ్యాఖ్యానించారు. ఇది అంత చెత్త సినిమా కాద‌నే త‌న ఉద్ధేశాన్ని బ‌య‌పెట్టారు. ఇదే జాన‌ర్ లో వ‌చ్చిన కొన్ని చెత్త సినిమాల‌ను విమ‌ర్శించ‌ని క్రిటిక్స్ త‌న‌ భ‌ర్త సూర్య న‌టించిన కంగువ‌ను మాత్రం దారుణంగా విమ‌ర్శించార‌ని, ఒక వ‌ర్గం మీడియా ప‌ని ఇద‌ని వాపోయారు జ్యోతిక‌.

కంగువ కంటే చెత్త సినిమాలు క‌మ‌ర్షియ‌ల్ గా స‌క్సెస్ సాధించాయ‌ని అన్నారు. త‌న భ‌ర్త న‌టించిన సినిమాని జ్యోతిక వెన‌కేసుకొచ్చారు. గత సంవత్సరం విమర్శకులు, ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిన కంగువ‌కు జ్యోతిక మ‌ద్ధ‌తుగా నిలిచారు. ది పూజా తల్వార్ షోలో మాట్లాడుతూ కంగువ‌ చిత్రానికి మద్దతుగా ఒక సుదీర్ఘ‌ నోట్ రాయాలనే తన నిర్ణయం వెన‌క కార‌ణం `సెల‌క్టివ్ క్రిటిక్స్` అని అన్నారు. కంగువ త‌ర‌హా లోపాలతో ఉన్న కొన్ని పెద్ద-బడ్జెట్ చిత్రాలు బాక్సాఫీస్ పరీక్షలో సానుకూల సమీక్షలతో ఉత్తీర్ణత సాధించినా కానీ.. కంగువాను అన్యాయంగా వేరు చేశారు. అదే జాన‌ర్‌లోని ఇతర చిత్రాలతో పోలిస్తే ఈ చిత్రం కఠినమైన విమర్శలను ఎదుర్కొందని జ్యోతిక‌ నిరాశను వ్యక్తం చేసింది.

చెడ్డ సినిమాల‌తో స‌మ‌స్య ఉంది. ద‌క్షిణాదిన బాక్సాఫీస్ వ‌ద్ద రాణించిన కొన్ని పెద్ద సినిమాల‌ను మంచి హృద‌యంతో స‌మీక్షిస్తే కంగువ‌ను మాత్రం చెడు హృద‌యంతో స‌మీక్షించార‌ని క్రిటిక్స్ పై పెద్ద బండ వేసారు జ్యోతిక‌. గొప్ప హృదయంతో సమీక్షించిన చాలా చెత్త సినిమాల‌ను నేను చూశాను అని జ్యోతిక‌ అన్నారు. నా భర్త సినిమా విషయానికి వస్తే, దానిని చాలా కఠినంగా సమీక్షించారని నేను భావించాను. సినిమాలో కొన్ని భాగాలు బాగా లేకపోవచ్చు. కానీ ఓవ‌రాల్ గా దానిలో చాలా శ్రమ దాగి ఉంది. కాబట్టి కొన్ని దయనీయమైన సినిమాల‌ కంటే కంగువా విష‌యంలో కఠినమైన సమీక్షలను చూసినప్పుడు నాకు బాధ కలిగింది. మీడియా న్యాయంగా లేకపోవడంపై నేను ఎక్కువగా కలత చెందాను! అని జ్యోతిక అన్నారు. కంగువ సౌండ్ డిజైన్, క‌థ‌నంపై వ‌చ్చిన విమ‌ర్శ‌ల్లో ధ్వ‌ని అస‌హ‌నంగా ఉంద‌న్న విమ‌ర్శ‌ల‌ను అంగీక‌రించారు. కానీ కంగువ‌పై ప్రతికూల స్పందన అధికంగా ఉందని ఆమె వాదించారు.

నేను ఇంతకు ముందు చూసిన అత్యంత తెలివితక్కువ భారీ బడ్జెట్ చిత్రాలలో మహిళలను వేధించడం, డబుల్ మీనింగ్ డైలాగ్‌లు మాట్లాడటం, అతిగా యాక్షన్ సన్నివేశాలు ఉండటం వంటి పాత కథలకు మీడియా స‌హా కొన్ని వర్గాల నుండి వచ్చిన సానుకూల సమీక్షలు నన్ను ఆశ్చర్యపరిచాయ‌ని జ్యోతిక తన పోస్ట్‌లో రాసారు.

సూర్య క‌థానాయ‌కుడిగా ద‌రువు శివ దర్శకత్వం వహించిన కంగువ దాదాపు 300-350 కోట్ల బడ్జెట్‌తో తెర‌కెక్కింది. సూర్య గిరిజన నాయకుడిగా నటించ‌గా, ఈ చిత్రంలో బాబీ డియోల్ విల‌న్ గా న‌టించాడు. భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లై డిజాస్ట‌రైంది. ప్రపంచవ్యాప్తంగా రూ.106 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ట్రేడ్ ప్ర‌కారం.. కంగువ తమిళ ప‌రిశ్ర‌మ‌లో వ‌చ్చిన‌ అతిపెద్ద బాక్సాఫీస్ డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది.

Tags:    

Similar News