చాహల్ (X) ధనశ్రీ: ఫోటోలతో పాటు కాపురాన్ని రీస్టోర్ చేసినట్టేనా?
చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో చాహల్ తన స్నేహితురాలు మహ్వాష్ తో కలిసి కనిపించడంతో రకరకాల పుకార్లు షికార్ చేసాయి.;
టీమిండియా ఆటగాడు యజ్వేంద్ర చాహల్ పేరు కొంతకాలంగా మీడియా హెడ్ లైన్స్ లోకొస్తున్న సంగతి తెలిసిందే. భార్య ధనశ్రీ వర్మతో కలిసి సంయుక్తంగా చాహల్ విడాకులను ప్రకటించాడు. ఈ జంట కలతలతో విడిపోతున్నామని ప్రకటించగానే అభిమానులు చాలా ఆవేదన చెందారు. బ్రేకప్ ప్రకటన తర్వాత చాహల్ యూట్యూబర్ మహ్వాష్ తో సన్నిహితంగా కనిపించడంతో దానిపై ధనశ్రీ వర్మ క్రిప్టిక్ గా వ్యాఖ్యానిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో చాహల్ తన స్నేహితురాలు మహ్వాష్ తో కలిసి కనిపించడంతో రకరకాల పుకార్లు షికార్ చేసాయి.
ఆడాళ్లను అనడం ఎప్పుడూ ఫ్యాషన్.. ! అంటూ ధనశ్రీ చాహల్ ను దెప్పి పొడుస్తూ గుంభనగా వ్యాఖ్యానించింది. దీని అర్థం చాహల్ (మగాడు) ఇష్టానుసారం తిరిగినా కానీ, అతడిని ఏమీ అనరు. ఆడవాళ్లను మాత్రం వెంటనే నిలదీస్తారనే ఉద్ధేశాన్ని ధనశ్రీ బయటపెట్టింది. ఈ ఫ్యామిలీ డ్రామా ఇలా ఉండగానే, ఇప్పుడు బ్రేకప్ ప్రకటన సమయంలో ఇన్ స్టా నుంచి డిలీట్ చేసిన జంట ఫోటోలను ధనశ్రీ వర్మ తిరిగి రీస్టోర్ చేసారు.
దీంతో సోషల్ మీడియాలో చాహల్ తో ధనశ్రీ కలిసి ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. జంటగా ఉన్న ఫోటోలను రీస్టోర్ చేయడం అంటే కాపురాన్ని కూడా రీస్టోర్ చేయడమేనని నెటిజనులు వాదిస్తున్నారు. ధనశ్రీ స్వయంగా విడిపోవడం లేదని నిర్ధారిస్తున్నారని ఊహిస్తున్నారు. ఈ ఊహలన్నీ నిజమే అయితే చాహల్- ధనశ్రీ జంట తిరిగి కలిసే అవకాశం ఉంది. కానీ దీనికి ఎలాంటి అధికారిక నిర్ధారణ లేదు. మరోవైపు ధనశ్రీ తన ఎనర్జిటిక్ డ్యాన్సులను ఇన్ స్టాలో రెగ్యులర్ గా షేర్ చేస్తున్న సంగతి తెలిసిందే.