ధనుష్, నయన్.. కేసు ఎక్కడిదాకా వచ్చింది..?

ఐతే ఈ కేసు ఏప్రిల్ 9కి వాయిదా పడింది. ధనుష్ మాత్రం ఈ కేసు విషయంలో అసలు వెనక్కి తగ్గకూడదని భావిస్తున్నాడు.;

Update: 2025-03-12 00:30 GMT

నయనతార పెళ్లి డాక్యుమెంటరీలో ధనుష్ నిర్మాణ సంస్థలో చేసిన నాన్ రౌడీ ధాన్ సినిమాకు సంబందిచిన క్లిప్స్ వాడారని ధనుష్ కోర్ట్ కి వెళ్లిన విషయం తెలిసిందే. ధనుష్ తన సొంత బ్యానర్ వండర్ బార్ ఫిలిమ్స్ బ్యానర్ లో నాన్ రౌడీ ధాన్ సినిమా నిర్మించాడు. ఆ సినిమాను విఘ్నేష్ శివన్ డైరెక్ట్ చేయగా నయనతార హీరోయిన్ గా నటించింది. ఐతే నయనతార పెళ్లి డాక్యుమెంటరీ నయనతార బియాండ్ ద ఫెయిరీ టేల్ లో నాన్ రౌడీ ధాన్ కి సంబంధించిన కొన్ని సెకన్ల క్లిప్స్ కనబడ్డాయి. దాంతో నయనతార మీద ధనుష్ కోర్ట్ కేసు వేశాడు.

ఈ వ్యవహారంపై నయనతార కూడా ధనుష్ గురించి ఒక పెద్ద నోట్ రాస్తూ ఫైర్ అయ్యింది. ధనుష్, నయనతార కేసు కోర్టులో నడుస్తుంది. ఐతే ధనుష్ పర్మిషన్ లేకుండా ఆ క్లిప్స్ వాడినందుకు కోటి రూపాయల దాకా జరిమానా కట్టాలని కోర్ట్ చెప్పింది. ఐతే దీనిపై నయనతార తరపున లాయర్ అవి వ్యక్తిగత కెమెరాలతో తీసినవి మాత్రమే అని అవి సినిమాలోనివి కాదని వాదించాడు. ఐతే అవి వాడటం కూడా కాపీ రైట్స్ ని ఉల్లఘించినట్టే అవుతుందని ధనుష్ తరపున న్యాయవాది వెల్లడించాడు.

ఐతే ఈ కేసు ఏప్రిల్ 9కి వాయిదా పడింది. ధనుష్ మాత్రం ఈ కేసు విషయంలో అసలు వెనక్కి తగ్గకూడదని భావిస్తున్నాడు. నయనతార కూడా ధనుష్ మీద ఫైట్ కు రెడీ అన్నట్టుగానే ఉంది. విఘ్నేష్ శివన్, నయనతార ఈ మ్యాటర్ ని కోర్టులోనే తేల్చుకోవాలని చూస్తున్నారు. ధనుష్ కూడా ఇష్యూ ఎక్కడిదాకా వెళ్తుందో చూద్దాం అని వెయిట్ చేస్తున్నాడు.

ఐతే కోలీవుడ్ ఆడియన్స్ మాత్రం ఇలా స్టార్ హీరో, స్టార్ హీరోయిన్ ఫైట్ వల్ల పరిశ్రమ అట్మాస్పియర్ దెబ్బ తింటుందని అంటున్నారు. ఏది ఏమైనా నయనతార పెళ్లి డాక్యుమెంటరీ వల్ల ధనుష్, నయన్ మధ్య ఈ దూరం గురించి అందరికీ తెలిసింది. ఐతే తన పెళ్లి డాక్యుమెంటరీలో క్లిప్స్ కి సహకరించిన వారందరికీ కూడా నయనతార స్పెషల్ థాంక్స్ నోట్ వేసిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News