ఎట్టకేలకు కోరిక తీర్చుకుంటున్న బన్నీ !

Update: 2019-09-06 15:31 GMT
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి కోలీవుడ్ లో గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వాలనే కోరిక ఎప్పటి నుండో ఉంది. అందుకోసమే ఆ మధ్య లింగుస్వామితో బైలింగ్వెల్ సినిమా ప్లాన్ చేసాడు. చెన్నై వెళ్లి లాంచ్ కూడా చేసారు. కానీ ఆ సినిమా అనుకోకుండా క్యాన్సల్ అయింది. ఆ తర్వాత తమిళ్ ఎంట్రీ ని లైట్ తీసుకున్న బన్నీ ఇప్పుడు ఎట్టకేలకు బైలింగ్వెల్ సినిమాకు అన్ని సెట్ చేసుకున్నాడు. ఇందుకోసం మురుగదాస్ ని లైన్ లో పెట్టాడు. ఈ మధ్యే అల్లు అర్జున్ కోసం మురుగదాస్ ఓ కథను రెడీ చేసాడట.  తన కోలీవుడ్ ఎంట్రీ కి పర్ఫెక్ట్ సబ్జెక్ట్ అని భావించిన బన్నీ వెంటనే మురుగదాస్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడట. దర్బార్ తర్వాత మురుగదాస్ చేయబోయే సినిమా ఇదేనని తెలుస్తుంది.

ప్రస్తుతం బన్నీ చేతిలో మూడు సినిమాలున్నాయి. త్రివిక్రమ్ తో 'అల వైకుంఠ పురములో' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత సుకుమార్ తో ఓ సినిమా అలాగే వేణు శ్రీరాంతో 'ఐకాన్' సినిమా చేయాల్సి ఉంది. అయితే ఇందులో ముందుగా సుకుమార్ సినిమాను స్టార్ట్ చేస్తాడు బన్నీ. ఈ సినిమాను వచ్చే నెల గ్రాండ్ గా లాంచ్ చేసి అదే నెలలో సెట్స్ పైకి తీసుకురావాలని భావిస్తున్నాడు స్టైలిష్ స్టార్.

అయితే సుకుమార్ సినిమాకు 'ఐకాన్' సినిమాకు మధ్య కొన్ని నెలలు మురుగదాస్ సినిమా కోసం డేట్స్ కేటాయించి కొంత  వరకూ షూటింగ్ కంప్లీట్ చేస్తాడని అంటున్నారు. అంటే బన్నీ 21వ మురుగదాస్ తో ఉండే ఛాన్స్ ఉంది. ప్రస్తుతానికైతే ఈ విషయంపై ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. త్వరలోనే బన్నీ మురుగదాస్ కాంబినేషన్ సినిమా అనౌన్స్ వచ్చే అవకాశం ఉంది.


Tags:    

Similar News