డిజె దువ్వాడ జగన్నాథమ్ టీజర్ ఈరోజు శివరాత్రి సందర్భంగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ టీజర్ ఎలా ఉంది అనే విషయంలో నిజం మాట్లాడుకుంటే.. హరీశ్ శంకర్ గబ్బర్ సింగ్ టీజర్లా చెలరేగిపోవట్లేదు అలాగే అల్లు అర్జున్ సరైనోడు టీజర్ తరహాలో దుమ్ముదులపలేదు. ఒక సింపుల్ డైలాగ్ తో ఏదో అలా అలా ఉందంతే. ఇంతకీ ఇంత సింపుల్ టీజర్ ను అసలు ఎందుకు రంగంలోకి దించినట్లు?
నిజానికి ఈ టీజర్ అస్సలు బన్నీకి ఏ మాత్రం నచ్చలేదని ఒక టాక్ ఉంది. మనోడు రెండు మూడు టీజర్లు కట్ చేయించీ కట్ చేయించీ విసిగిపోయాడని.. అందుకే హరీశ్ శంకర్ తో ఏదో ఒకటి కట్ చేసి ఇచ్చేమని చెప్పాడని ఫిలిం నగర్లో రూమర్లు వినిపిస్తున్నాయి. అదంతా ఒకెత్తయితే.. కేవలం ఒక బిజినెస్ స్ర్టాటజీతోనే ఈ టీజర్ ఇలా కట్ చేశారని కూడా టాక్ వినిపిస్తోంది. నిజానికి బన్నీ వరుసగా రేసుగుర్రం.. సన్నాఫ్ సత్యమూర్తి.. రుద్రమదేవి.. సరైనోడు వంటి సినిమాలతో మెగా బ్లాక్ బస్టర్లు కొట్టేశాడు. ఇప్పుడు కూడా డిజె టీజర్ అదిరిపోయిదంటే మాత్రం.. వెంటనే హైప్ పెరుగుతుంది. ఆ హైప్ ను ఏ మాత్రం అందుకోలేకపోయినా కూడా.. సినిమా డిజాష్టర్ అయిపోయే ఛాన్సుంది. అందుకే హైప్ ను తగ్గించడానికి ఇలా సింపుల్ టీజర్ ను కట్ చేసి కలరింగ్ ఇస్తున్నారట. అది సంగతి.
ఏదేమైనా కూడా బన్నీ మాత్రం బ్రహ్మణుడి గెటప్ లో రొమాంటిక్ గా ఉన్నాడంటూ మనోడి లేడీ ఫ్యాన్స్ క్రష్ ను ఇంకా పెంచేసుకుంటున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/