నెట్టింట వైరల్ వీడియోలు.. విద్యాబాలన్ స్ట్రాంగ్ రియాక్షన్!
సోషల్ మీడియా, వాట్సప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతోన్న వీడియోలను ఉద్దేశించి బాలీవుడ్ నటి విద్యా బాలన్ స్పందించారు.
సోషల్ మీడియాలో బాలీవుడ్ నటి విద్యా బాలన్ వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి! ప్రధానంగా... ఫేస్ బుక్ తో పాటు వాట్సప్ గ్రూపుల్లోనూ ఆ వీడియోలు హల్ చల్ చేస్తున్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో విద్యా బాలన్ స్పందించారు. ఈ సందర్భంగా ఓ సందేశం విడుదల చేశారు. ఇదే సమయంలో.. అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అవును... సోషల్ మీడియా, వాట్సప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతోన్న వీడియోలను ఉద్దేశించి బాలీవుడ్ నటి విద్యా బాలన్ స్పందించారు. ఈ సందర్భంగా ఆ వీడియోలతో తనకు ఏమాత్రం సంబంధం లేదని.. అవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో క్రియేట్ చేసిన డీప్ ఫేక్ వని తెలిపారు. ఈ విషయంలో నెటిజన్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఈ సందర్భంగా స్పందించిన విద్యా బాలన్... ఈ మధ్యకాలంలో తనకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియా, వాట్సప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతున్నాయి.. అయితే, అవన్నీ ఏఐ జనరేటేడ్ వీడియోలను తెలిపారు. ఆ వీడియోలతో తనకు ఎటువంటి సంబంధం లేదని.. వాటిని క్రియేట్ చేయడం, షేర్ చేయడంలో తన ప్రమేయం లేదని అన్నారు.
ఇదే సమయంలో.. ఆ వీడియోల్లోని కంటెంట్ ను తాను ఏమాత్రం అంగీకరించనని.. అందువల్ల సోషల్ మీడియాలో ఆ వీడియోలు షేర్ చేసే ముందు దయచేసి వాటి గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలని కోరారు. ఏఐ జనరేటెడ్ కంటెంట్ మిమ్మల్ని తప్పుదోవ పట్టించే ప్రమాదం ఉందని చెబుతూ.. అప్రమత్తంగా ఉండాలని కోరారు.
కాగా... ఈ డీప్ ఫేక్ టెక్నాలజీ కారణంగా ఇప్పటికే ఎంతోమంది హీరోయిన్లు, సెలబ్రెటీలు ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. రష్మిక మందాన, కత్రినా కైఫ్, దీపికా పదుకొణె, అలియా భట్, కాజోల్ వంటి హీరోయిన్లు ఈ టెక్నాలజీ బాధుతులే!
ఇదే సమయంలో పలువురు క్రీడాకారులు, వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన ఏఐ జనరేటెడ్ కంటెంట్ కూడా నెట్టింట హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే.