వేశ్య క‌థ ఉత్త‌మ ఆస్కార్ చిత్రంగా

97వ ఆస్కార్ అవార్డుల కార్య‌క్ర‌మం ఎంతో వైభ‌వంగా జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈసారి ఉత్త‌మ చిత్రంగా `అనోరా` అనే రొమాంటిక్ చిత్రం నిలిచింది;

Update: 2025-03-03 08:30 GMT

97వ ఆస్కార్ అవార్డుల కార్య‌క్ర‌మం ఎంతో వైభ‌వంగా జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈసారి ఉత్త‌మ చిత్రంగా `అనోరా` అనే రొమాంటిక్ చిత్రం నిలిచింది. ఉత్త‌మ అవార్డుతో పాటు, మ‌రో నాలుగు విభాగాల్లో అస్కార్ అవార్డుల‌ను ద‌క్కించుకోవ‌డం విశేషం. ఉత్త‌మ న‌టి, ఉత్త‌మ డైరెక్ట‌ర్, ఉత్త‌మ ఒరిజిన‌ల్ స్క్రీన్ ప్లే, ఉత్త‌మ ఎడిటింగ్ ఇలా ఐదు విభాగాల్లో ఆస్కార్ వేడుక‌లో మెరిసింది `అనోరా`.

అయితే ఇది ఓ వేశ్య క‌థ కావ‌డం విశేషం. ర‌ష్యాకి చెందిన కోటీశ్వ‌రుడి కుమారుడు చ‌దువుకోవ‌డానికి ఆమెరికా వెళ్తాడు. అక్క‌డ అనుకోకుండా ఓ వేశ్య‌ని క‌లుస్తాడు. వారం పాటు త‌న‌తో ఉండేలా ఆ వేశ్య‌తో డ‌బ్బులిచ్చి అగ్రిమెంట్ చేసుకుంటాడు. కానీ కొన్ని రోజుల‌కే వేశ్య ప్రేమ‌లో ప‌డి ఆమెని పెళ్లిచేసు కుంటాడు. కానీ ఈ విష‌యాలు ఇంట్లో తెలిసి ఆ కుర్రాడిని త‌ల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్లిపోతారు.

దీంతో ఆ వేశ్య ఏమైందా? ఆ ప‌రిస్థితిని ఎలా అధిగ‌మించింది? ఈ క‌థ ఎలా కంచికి చేరింది? అన్న‌ది క‌థ‌. ఇది వేశ్య క‌థ కావ‌డంతో 18 ప్ల‌స్ వారికే అనుమ‌తి తో ఆడిన చిత్ర‌మిది. థియేట్రిక‌ల్ రిలీజ్ లో ఈ సినిమాకు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ద‌క్కాయి. చాలా మంది ప్రేక్ష‌కులు మెచ్చిన చిత్రంగా నిలిచింది. సినిమాలో బోల్డ్ స‌న్నివేశాలున్నా? అవ‌న్నీ క‌థ‌లో భాగంగా వ‌చ్చేవి. క‌మ‌ర్శియ‌ల్ కోణంలో ఎక్క‌డా జొప్పించిన‌ట్లు ఉండ‌వు.

ద్వితియార్ధం ఎమోష‌న‌ల్ గా క‌నెక్ట్ అవుతుంది. క్లైమాక్స్ ఆశ్చ‌ర్య ప‌రుస్తుంది. ఇలా అడుగ‌డుగునా సినిమా కి పాజిటివ్ వైబ్ ఉంది. ఎక్క‌డా విమ‌ర్శ‌లు త‌లెత్త‌లేదు. అయితే 18 ఏళ్ల పైబ‌డిన వారికే అనుమ‌తి అంటే? సినిమా పై ఓ ర‌క‌మైన అభిప్రాయం ఏర్ప‌డుతుంది. కానీ ఈ క‌థ‌లో మ‌హిళ‌ను ప‌రిస్థితులు ఎలాంటి ప‌రిస్థితుల్లో ప‌డుపు వృత్తికి ప్రేరేపిస్తాయి? అన్న‌ది ఎంతో గొప్ప‌గా హైలైట్ అయింది. ఆ స‌న్నివేశాల్ని ఎంతో హృద్యంగానూ హైలైట్ చేసారు. దీంతో మ‌రో ఆలోచ‌న లేకుండా ఆస్కార్ ఉత్త‌మ చిత్రంగా ఎంపికైంది.

Tags:    

Similar News