ఆ సమస్య నుంచి బయటపడ్డా!
డెంగ్యూ తర్వాత తాను తీవ్రమైన హెయిర్ ఫాల్ సమస్యతో బాధ పడుతున్నట్టు తెలిపిన మృణాల్ దాన్ని సవాల్ గా తీసుకున్నట్టు తెలిపింది.;
సీతారామం, హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న మృణాల్ ఠాకూర్ తన సోషల్ మీడియా ద్వారా హెయిర్ ఫాల్ గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. గతేడాదిలో తాను డెంగ్యూ జ్వరంతో పడిన ఇబ్బందుల్ని ఆమె గుర్తు చేసుకుంది.
డెంగ్యూ తర్వాత తాను తీవ్రమైన హెయిర్ ఫాల్ సమస్యతో బాధ పడుతున్నట్టు తెలిపిన మృణాల్ దాన్ని సవాల్ గా తీసుకున్నట్టు తెలిపింది. అయితే ఆ సమస్యను తాను సరైన ట్రీట్‌మెంట్, కావాల్సిన విటమిన్ ట్యాబ్లెట్స్ ద్వారా అధిగమించినట్టు చెప్పుకొచ్చింది. ఇప్పుడు తాను ఆ సమస్య నుంచి బయటపడ్డానని, మళ్లీ తనకు ఊడిపోయిన జుట్టు తిరిగొస్తుందని చెప్తూ తన బేబీ హెయిర్ ను చూపించింది మృణాల్.
ఈ విషయంలో ఎవరూ తమ పట్ల తాము కఠినంగా ఉండకూడదని, హెయిర్ ఫాల్ టైమ్ లో రెండు విషయాలను అనుసరించాలని తెలిపింది మృణాల్. అసలు సమస్య ఎక్కడ మొదలైందనే రీజన్ తో పాటూ జుట్టుకు సరైన సంరక్షణను చేస్తే ఈ సమస్యను అధిగమించొచ్చని చెప్తోంది మృణాల్. రెగ్యులర్ మసాజ్, తరచూ హెయిర్ కేర్ మెయిన్‌టెయిన్ చేస్తే హెయిర్ ఫాల్ ను కంట్రోల్ చేయిచ్చని చెబుతోంది ఈ అందాల తార.
ప్రస్తుతం అడివి శేష్ తో కలిసి కలిసి డెకాయిట్ సినిమా చేస్తున్న మృణాల్, ఈ సినిమాలో చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించనుందని ఫస్ట్ లుక్ చూస్తేనే అర్థమవుతుంది. డెకాయిట్ మూవీతో ఎలాగైనా మంచి హిట్ అందుకుని టాలీవుడ్ లో తన ప్లేస్ ను పర్మినెంట్ చేసుకోవాలని చూస్తుంది. డెకాయిట్ హిట్ అయితే మృణాల్ మళ్లీ టాలీవుడ్ లో బిజీ అయిపోయే అవకాశాలు లేకపోలేదు. అంతేకాదు, ఇప్పటివరకు హోమ్లీ పాత్రలకే పరిమితమైన మృణాల్ ఈ సినిమాతో ప్రూవ్ చేసుకుంటే యాక్షన్ తరహా పాత్రలు కూడా తనకు వచ్చే ఛాన్సుంది.