జూనియర్ ధనుష్ పై ప్రదీప్ కామెంట్స్..!
అయితే ఇతడు నటన పరంగా ధనుష్ ని కాపీ కొట్టడమే కాకుండా...అతడిలాగే ప్రదీప్ పేస్ కూడా ఉంటుందని నెట్టింట కామెంట్లు కనిపిస్తున్నాయి.;
కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీర్ రంగనాధ్ 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' తో మరో భారీ విజయం అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఏకంగా 100 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. తొలి చిత్రం 'లవ్ టుడే' సక్సెస్ అవ్వడం..రెండవ చిత్రం కూడా విజయం సాధించడంతో? రంగనాద్ మంచి ఫాంలో కనిపి స్తున్నాడు. అయితే ఇతడు నటన పరంగా ధనుష్ ని కాపీ కొట్టడమే కాకుండా...అతడిలాగే ప్రదీప్ పేస్ కూడా ఉంటుందని నెట్టింట కామెంట్లు కనిపిస్తున్నాయి.
ఇదే విషయాన్ని ప్రదీర్ రంగనాధ్ ముందుకు తీసుకెళ్తే ఆయన సమాధానం ఇలా ఉంది. 'చాలా కాలంగా ఇలాంటి కామెంట్లు వింటున్నాను. కానీ నేను ఎవరిని ఇమిటేట్ చేయడం లేదు. నా ఫిజిక్, ఫేస్ కట్ వల్ల అంతా అలా అనుకుంటున్నారు. ధనుష్ లా ఉండటం? మీకు ప్లస్ అవుతుందా? మై నస్ అవుతుందా? అని అడిగితే? అదంతా నాకు తెలియదు. నేను అద్దం ముదు నుంచుని చూసుకుంటే నాకు నేనుగానే కనిపిస్తాను.
నేను తీసిన సినిమా బాగా ఆడుతుందంటే? నేను బాగానే నటిస్తున్నాను అని అనుకుంటున్నాను' అన్నాడు. ఇంతలో దర్శకుడు అశ్వత్ మారిముత్తు మైక్ లాకుని ఇలా అన్నాడు. 'మీ కళ్లకు మాత్రమే ఫలానా హీరో కనిపిస్తున్నాడేమో నాకు మాత్రం ప్రదీప్ లాగే కనిపిస్తున్నాడు. మిగతా హీరోలతో పోల్చాలనే ఈప్రశ్న అడిగినట్లు ఉంది. ప్రదీప్ లో మాత్రం నేను ఏ హీరో ను చూడలేదని కాస్త అసహనాన్ని వ్యక్తం చేసాడు.
ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. డ్రాగన్ చిత్రంలో ధనుష్ నటన శైలి ధనుష్ ని కాపీ కొట్టినట్లు ఉందని కొన్ని రివ్యూల్లో కూడా వ్యక్తమైంది. ఆయన తొలి సినిమా లవ్ టుడే పెర్పార్మెన్స్ కి...ఫేస్ లో ఎక్స్ ప్రెషన్స్ కి చాలా వ్యత్యాసం ఉంది. ధనుష్ అటెన్షన్ గ్రాబ్ చేసినట్లుందని ప్రచారం జరిగింది. కోలీవుడ్ మీడియాలో కూడా ఈ రకమైన కథనాలు వైరల్ అవుతున్నాయి.