వెండి తెరపై మరో అద్భుతం...ఆ కాంబినేషన్ ఇదే!
కోలీవుడ్ స్టార్ ధనుష్ మల్టీ ట్యాలెంటెడ్ పర్సనాల్టీ. హీరోగా, గాయకుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా సత్తా చాటుతోన్న సంగతి తెలిసిందే.;
కోలీవుడ్ స్టార్ ధనుష్ మల్టీ ట్యాలెంటెడ్ పర్సనాల్టీ. హీరోగా, గాయకుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా సత్తా చాటుతోన్న సంగతి తెలిసిందే. ఇలా నాలుగు విభాగాల్లో రాణించడం అంటే చిన్న విషయం కాదు. హీరోగా ఏటా అభిమానుల ముందుకు సినిమాలు తీసుకొస్తూ....ఏక ధాటిగా నిర్మాతగా , డైరెక్టర్ గా కొనసాగడం సాహజమనే చెప్పాలి. ఆ సాహసాన్ని ఎంతో దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తున్నాడు.
ఇప్పటి వరకూ డైరెక్టర్ గా నాలుగు సినిమాలు చేసాడు. `పా పాండి`, `రాయన్` సినిమాలు తెరకెక్కించాడు. ప్రస్తుతం మరో రోండు సినిమాలకు దర్శకత్వం వహిస్తున్నాడు. `ఇడ్లీ కడై`, ` నిలవాక్కు ఎన్ మెల్ ఎన్నడి కోబమ్` చిత్రాలు ఆన్ సెట్స్లో ఉన్నాయి. ఈ రెండు సినిమాలకు తానే నిర్మాత కూడా. అటు హీరోగా `కుభేర`, `ఇడ్లీ కడై`తో పాటు బాలీవుడ్ లో `తేరీ ఇష్క్ మే`లోనూ నటిస్తున్నాడు. ఇలా నటుడిగా, దర్శకుడి, నిర్మాతగా బిజీగా ఉన్నాడు.
మరి ఇంత బిజీలోనూ ధనుష్ స్టార్ హీరో అజిత్ హీరోగా ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడా? అంటే అవుననే తెలుస్తోంది. ఇద్దరి కాంబినేషన్ లో ఓ భారీ సినిమాకు సన్నాహాలు జరుగుతున్నట్లు కోలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే ఇది క్రేజీ కాంబినేషన్ అవుతుంది. ఇంత వరకూ ధనుష్ స్టార్ హీరోలెవర్నీ డైరెక్ట్ చేయలేదు. తనని తానే డైరెక్ట్ చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో అజిత్ ని డైరెక్ట్ చేస్తే ఆ ప్రాజెక్ట్ మరింత ప్రతిష్టాత్మకంగా మారుతుంది.
స్టార్ హీరోలు డైరెక్షన్ చేయడం అన్నది మాలీవుడ్... కోలీవుడ్ లోనే సాధ్యమైంది. మాలీవుడ్ లో పృధ్వీ రాజ్ సుకుమారన్ హీరోగా, దర్శకుడిగా సక్సెస్ పుల్ కెరీర్ చూస్తున్నాడు. ఈ మధ్యనే మోహన్ లాల్ కూడా డైరెక్టర్ గా లాంచ్ అయ్యాడు. కోలీవుడ్ నుంచి ధనుష్ తో పాటు విశాల్ కూడా డైరెక్టర్గా ఆసక్తి చూపిస్తున్నాడు.