యంగ్ హీరోతో పెళ్లైన బ్యూటీ రొమాంటిక్ సినిమా!

తాజాగా కీర్తిసురేష్ మ‌రో కొత్త ప్రాజెక్ట్ కి సైన్ చేసిన‌ట్లు తెలుస్తోంది. 'గుడ్ నైట్', 'టూరిస్ట్ ఫ్యామిలీ' లాంటి స‌క్సెస్ ఫుల్ చిత్రాల‌ను నిర్మించిన మిలియ‌న్ డాల‌ర్స్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.;

Update: 2025-03-03 09:20 GMT

కీర్తి సురేష్ పెళ్లి త‌ర్వాత బ్రేక్ తీసుకున్న సంగ‌తి తెలిసిందే. వివాహం అనంతరం కీర్తి భ‌ర్త‌తో క‌లిసి వెకేష‌న్ కు చెక్కేసింది. దీంతో షూటింగ్ లు పెండింగ్ లో ప‌డ్డాయి. ప్ర‌స్తుతం అమ్మ‌డు 'రివాల్వ‌ర్ రిటా', 'క‌న్నై వేడి' చిత్రాల్లో న‌టిస్తోంది. రెండు త‌మిళ్ చిత్రాలు ఆన్ సెట్స్ లో ఉన్నాయి. తాజాగా కీర్తిసురేష్ మ‌రో కొత్త ప్రాజెక్ట్ కి సైన్ చేసిన‌ట్లు తెలుస్తోంది. 'గుడ్ నైట్', 'టూరిస్ట్ ఫ్యామిలీ' లాంటి స‌క్సెస్ ఫుల్ చిత్రాల‌ను నిర్మించిన మిలియ‌న్ డాల‌ర్స్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.


ఇదే సినిమాతో కొత్త కుర్రాడు ద‌ర్శ‌కుడిగా ప‌రిచయం అవుతున్నాడు. ఇందులో త‌మిళ యంగ్ హీరో అశోక్ సెల్వ‌న్ హీరోగా న‌టిస్తున్నాడు. అయితే ఇదొక రొమాంటిక్ చిత్ర‌మ‌ట‌. ఇందులో హీరోతో కీర్తి సురేష్ అంతే రొమాంటిక్ గానూ న‌టిస్తుంద‌ని స‌మాచారం. మ‌రి ఆ రొమాన్స్ లిమిట్స్ లో ఉంటుందా? బోర్డ‌ర్ దాటుతుందా? అన్న‌ది రానున్న రోజుల్లో తెలుస్తోంది. కొన్నాళ్ల పాటు స్కిన్ షోకు దూరంగా ఉన్న కీర్త సురేష్ ఈ మ‌ధ్య కాలంలో కొన్ని మిన‌హాయింపులు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.

'స‌ర్కారు వారి పాట‌' లో స్కిన్ షోతో అల‌రించింది. అలాగే బాలీవుడ్ వెబ్ సిరీస్ ల కోసం గ్లామ‌ర్ గేట్లు కూడా ఎత్తేసింది. 'అక్కా' వెబ్ సిరీస్లో ఏకంగా బోల్డ్ బ్యూటీ రాధికా ఆప్టేతో పోటీ ప‌డి మ‌రీ న‌టిస్తోంది. ఇవ‌న్నీ కీర్తి లో ఒక్క‌సారిగా వ‌చ్చిన మార్పులే. తాజాగా యంగ్ హీరోతో కూడా రొమాంటిక్ స‌న్నివేశాల‌తో న‌టించ‌డానికి సై అన‌డంతో? కీర్తి లో మార్పుకు అంతా షాక్ అవుతున్నారు.

భ‌విష్య‌త్ లో న‌టిగా ఇంకెలాంటి మార్పులు తీసుకొస్తుంది? అన్న సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. 'నేను శైల‌జ' తో హీరోయిన్ గా ప‌రిచ‌య‌మైన అమ్మ‌డు చాలా కాలం పాటు, గ్లామ‌ర్ పాత్ర‌ల‌కు దూరంగా ఉంది. 'మ‌హాన‌టి'తో న‌టిగా ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ గుర్తింపు ఏర్ప‌డింది. దీంతో ఆ ఇమేజ్ నుంచి బ‌య‌ట‌కు రావ‌డానికి చాలా స‌మ‌యం ప‌ట్టింది. ఈ క్ర‌మంలో ఎన్నో సినిమా అవ‌కాశాల్ని వ‌దులుకుంది. ఆ ర‌కంగా కెరీర్ ప‌రంగా బాగా వెనుక‌బ‌డింది. రియ‌లైజ్ అవ్వ‌డానికి చాలా స‌మ‌యం తీసుకుంది.

Tags:    

Similar News