హవాయి హవాయి.. "నారి" నుంచి సునీత మ్యూజికల్ ట్రీట్..

టాలీవుడ్‌లో విభిన్న కథాంశాలతో ఆకట్టుకునే కొన్ని సినిమాలు విడుదలకు ముందే ఆసక్తిని కలిగిస్తూ ఉంటాయి.;

Update: 2025-03-03 06:30 GMT

టాలీవుడ్‌లో విభిన్న కథాంశాలతో ఆకట్టుకునే కొన్ని సినిమాలు విడుదలకు ముందే ఆసక్తిని కలిగిస్తూ ఉంటాయి. ఇక ఆ తరహాలోనే "నారి" సినిమా వరుస అప్డేట్స్ ద్వారా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటోంది. ప్రస్తుత సామాజిక పరిస్థితుల్లో 13-20 ఏళ్ల పిల్లలు ప్రమాదంలో ఉన్నారనే ఒక విషయాన్ని హైలెట్ చేస్తూ దర్శకుడు సూర్య వంటిపల్లి ఈ చిత్రాన్ని రూపొందించారు.

మహిళల్ని గౌరవించాలి, ఆడిపిల్లలు అన్ని రంగాల్లో ఎదిగేందుకు సహకరించాలనే మంచి అంశాలతో సినిమా ద్వారా సందేశాన్ని ఇవ్వనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ సినిమాపై ఆసక్తిని పెంచగా, తాజాగా సింగర్ సునీత పాడిన "హవాయి హవాయి హవాయి" పాటను మేకర్స్ విడుదల చేశారు. భాస్కరభట్ల రచించిన ఈ పాటకు వినోద్ కుమార్ విన్ను సంగీతం అందించారు. ఇక లిరికల్ సాంగ్ గా ఇది సంగీతప్రియులను అలరిస్తోంది.

ఇప్పటికే రమణ గోగుల పాడిన "గుండెలోన ఏదో గట్టి సప్పుడైనదే" పాట యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. మిలియన్స్ వ్యూస్ సాధిస్తూ, ట్రెండింగ్‌లో నిలిచింది. ఇప్పుడు సునీత పాడిన "హవాయి హవాయి హవాయి" పాట యూత్‌ఫుల్ ఫీల్ కలిగిస్తూ, విభిన్నమైన సంగీత ప్రయాణాన్ని అందించబోతోంది. సినిమాలో ఓ మంచి లవ్ బాండింగ్ ను ప్రతిబింబించేలా ఈ పాట ఉందని చిత్రబృందం వెల్లడించింది.

ఇక సినిమాను మరింత ఎక్కువమంది ప్రేక్షకులు ఆస్వాదించేందుకు మేకర్స్ ప్రత్యేక ఆఫర్ ప్రకటించారు. మార్చి 7న విడుదల కానున్న ఈ సినిమా కోసం ఓ స్పెషల్ "వన్ ప్లస్ వన్" టికెట్ ఆఫర్‌ను అమలు చేస్తున్నారు. 7వ తేదీన మార్నింగ్ షోకు, 8వ తేదీన అన్ని షోలకు ఈ ఆఫర్ వర్తించనుంది. కపుల్స్‌కు ఇది సంతోషకరమైన ఆఫర్ అని మేకర్స్ చెబుతున్నారు.

"నారి" సినిమాలో ఆమని, వికాస్ వశిష్ఠ, మౌనిక రెడ్డి, ప్రగతి, సునయన, కేదార్ శంకర్, ప్రమోదినీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి వినోద్ కుమార్ విన్ను సంగీతం అందించగా, సినిమాటోగ్రఫీని వి. రవికుమార్, భీమ్ సాంబ అందించారు. మాధవ్ కుమార్ గుల్లపల్లి ఎడిటింగ్ చేశారు. "నారి" సినిమా నిర్మాణ బాధ్యతలను శ్రీమతి శశి వంటిపల్లి చేపట్టారు. మంచి కథతో పాటు, ఎమోషనల్ టచ్, మ్యూజికల్ హైపాయింట్స్‌తో "నారి" ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించబోతోంది.

Full View
Tags:    

Similar News