అన్నయ్య మీదే సెటైర్లా తమ్ముడూ!!

Update: 2015-04-11 17:30 GMT
మొన్ననే అన్నయ్య అల్లు అర్జున్‌ ట్విట్టర్‌లోకి అడుగుపెట్టాడు. అయితే అది తమ్ముడు అల్లు శిరీష్‌ చలువేనంటూ స్వయంంగా బన్నీయే సెలవిచ్చాడు. ఇకపోతే శిరీష్‌ మాత్రం అన్నయ్యకు సలహాలు ఇస్తున్నట్లే సైటెర్లు వేస్తున్నాడు. ఇదంతా చూడ్డానికి కామెడీగా ఉన్నా కూడా.. అసలు శిరీష్‌ ఇలా సెటైర్లు ఎందుకు బాసూ అంటూ మెగా ఫ్యాన్స్‌ మాట్లాడుకుంటున్నారు.

''ట్విట్టర్‌లో నాకు పెద్దగా ఏం తెలియదు. ఇప్పుడిప్పుడే ఏ బటన్‌ ఏంటో తెలుసుకుంటున్నా..'' అంటూ ట్వీటేశాడు బన్నీ. దీనికి బదులు.. ''తెలుసుకో తెలుసుకో.. కాని ట్విట్టర్‌లో స్పెల్లింగ్‌ కరెక్షన్‌, గ్రామర్‌ కరక్షన్‌ ఉండదు జాగ్రత్త'' అంటూ రిప్లయ్‌ ఇచ్చాడు శిరీష్‌. దీనర్ధం ఏంటి? అంటే బన్నీకి కరెక్టు స్పెల్లింగ్స్‌ రాదనా లేకపోతే మనోడు స్పెల్‌ చెక్‌ లేకుండా టైప్‌ చేయలేడనా? అసలు శిరీష్‌ జోక్‌ ఏదైనా కూడా అది బన్నీకి చెక్‌ పెట్టేలా ఉందనేది ఫ్యాన్స్‌ ఫీలింగ్‌.

ఇకపోతే ట్విట్టర్‌లో అన్నయ్యకు సలహాలు ఇచ్చింది చాల్లే కాని, తదుపరి సినిమా గురించి తమ్ముడు అన్నయ్య దగ్గర టిప్స్‌ తీసుకొని, తన కొత్త సినిమాను ఎప్పుడు స్టార్ట్‌ చేస్తున్నాడు మరి? బన్నీ సినిమాలు వస్తున్నాయ్‌ వెళుతున్నాయ్‌, కొత్తవి మొదలవుతున్నాయ్‌. కాని శిరీష్‌ మాత్రం ఎక్కడా కనిపించట్లేదు. హమ్‌మ్‌!!
Tags:    

Similar News