క్రిస్టియన్ హీరోయిన్.. హిందూ ముస్లిం కథ

Update: 2017-12-19 06:13 GMT
రియల్ లైఫ్‌ ఎంత డిఫరెంట్ గా ఉంటుందో.. సినిమా లైఫ్‌ కూడా అదే తరహాలో ఉంటుంది. అయితే ఇక్కడ ఎవరు ఏ పాత్రను పోషించినా కూడా.. భలే వింతగా ఉంటుంది. అదిగో ఇప్పుడు స్వతహాగా క్రిస్టియన్ అయిన ఒక హీరోయిన్.. తెరపై ఒక ముస్లిం యువతి పాత్రలో నటిస్తూ.. ఒక హిందూ యువకుడి ప్రేమలో పడే పాత్రలో నటిస్తోంది. ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితులు చూస్తుంటే.. ఇలాంటి పాత్రలు సెక్యులరిజంను చాటిచెబుతున్నాయనే అనుకోవాలి.

త్వరలో రాబోయే ఒక సినిమాలో మలయాళ భామ అమలా పాల్.. ఒక ముస్లిం యువతి పాత్రలో కనిపించనుంది. చరణ్‌ తేజ్ అనే హీరో కమ్ దర్శకుడు.. ''ఆయుష్మాన్ భవ'' అనే సినిమాను చేస్తున్నాడు. నిన్న మనం చూసిన స్నేహా ఉల్లాల్ సెక్సీ పోస్టర్.. ఈ సినిమాలోనిదే. ఈ సినిమాను మొత్తంగా ఈస్ట్ గోదావరి జిల్లాలో షూటింగ్ చేస్తున్నప్పటికీ.. కథ మాత్రం యునివర్సల్ ఎప్పీల్ కలిగియుంటుందట. అందుకే మెయిన్ హీరోయిన్ పాత్రకు అమలాపాల్ ను ఎంచుకున్నారని టాక్. చూస్తుంటే మతసామరస్యం తాలూకు భావాలన్నీ అసలు అమల పాత్రలో నే కనిపిస్తున్నాయట. చూద్దాం మరి అమల ఈ సినిమాతో ఎలా ఇంప్రెస్ చేసి టాలీవుడ్ లో తన రీ-ఎంట్రీని పటిష్టం చేసుకుంటుందో.

ఇకపోతే అసలు పెళ్ళి టైములో మంచు విష్ణు వంటి హీరోలను కూడా రిజెక్ట్ చేసిన అమలా పాల్.. ఇప్పుడు మాత్రం ఇలా కొత్త కొత్త డైరక్టర్లతో కొత్త కొత్త హీరోలతో చేయడానికి కూడా రెడీ అయిపోయింది. అందుకేమరి.. అవకాశం వచ్చినప్పుడే అందిపుచ్చుకోవాలనేది.

Tags:    

Similar News