మహిళ గ్యాంగ్ రేప్ కథ.. అమితాబ్ కంటతడి

Update: 2019-10-21 12:02 GMT
అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా నిర్వహిస్తున్న ‘కౌన్ బనేగా కరోడ్ పతి’లో విభిన్నమైన వ్యక్తులు.. విభిన్నమైన తమ వ్యక్తిగత జీవితాలను వెల్లడిస్తుంటారు. తాజాగా అలాంటి భావోద్వేగమైన ఘటన బిగ్ బి షోలో అందరికీ కంటతడి పెట్టించింది. కేబీసీలో ప్రసారమైన ఈ కథనం బిగ్ బి అమితాబ్ నే కాకుండా బాలీవుడ్ తారలను కూడా ఓ తెలుగు మహిళ విషాదగాథ కదిలించింది. అదిప్పుడు వైరల్ గా మారింది.

తెలుగు మహిళ - పద్మ భూషన్ సునీత కృష్ణన్ మానవ అక్రమ రవాణాను రక్షించే బాధ్యతలు చేపడుతూ సామాజిక కార్యకర్తగా వ్యవహరిస్తోంది. ఈ సందర్భంగా కేబీసీలో అమితాబ్ ముందుకు కంటెస్టెంట్ గా వచ్చింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సునీత తన జీవితంలో జరిగిన గ్యాంగ్ రేప్ ను చెప్పి అమితాబ్ బచ్చన్ ను కంటతడి పెట్టించింది.

ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ తన యుక్త వయసులో ఆరుగురు వ్యక్తుల చేతిలో తాను గ్యాంగ్ రేప్ నకు గురయ్యాననే విషయాన్ని చెప్పి అంతటితో కంటతడి పెట్టించింది. అమితాబ్ ఈ మాటలను విని భావోద్వేగానికి గురయ్యాడు. ఇక తాను మహిళల బారిన పడకుండా ఎలా చర్యలు తీసుకుంటాననే విషయం బిగ్ బికి చెప్పినప్పుడు ఆయన కన్నీళ్లను ఆపుకోలేక ఏడ్చేశారు. ఇక ఓ సెక్స్ రాకెట్ లో మూడేళ్ల బిడ్డను - మరో యువతిని రక్షించిన సునీత విషయాన్ని కూడా విని బిగ్ బి ఎమోషనల్ అయ్యాడు.

ఇక ఈ ఎపిసోడ్ ను చూసిన బాలీవుడ్ తార అనుష్కశర్మ కూడా ఆవేదనకు గురైంది. ట్విట్టర్ లో ప్రస్తావించి షాక్ కు గురైంది. మూడేళ్ల చిన్నారి సెక్స్ ట్రాఫికింగ్ గురికావడం అత్యంత దయనీయం అని ఆమె ట్వీట్ చేశారు.


Tags:    

Similar News