ఆ జాబితాలో మోడీ త‌ర్వాత బిగ్‌ బీ నే!

Update: 2020-02-08 01:30 GMT
అమితాబ్ బ‌చ్చ‌న్‌....గ‌త ఐదు ద‌శాబ్దాలుగా త‌న న‌ట‌న‌తో బాలీవుడ్‌ ను ఉర్రూత‌లూగిస్తోన్న న‌ట దిగ్గ‌జం. 1969లో `సాత్ హిందుస్థానీ`తో హీరోగా తెరంగేట్రం చేసిన అమితాబ్‌...విల‌క్ష‌ణ న‌టుడిగా - వ్యాఖ్యాత‌గా - నిర్మాత‌గా - నేప‌థ్య గాయ‌కుడిగా - రాజ‌కీయ వేత్త‌గా....ప‌లు రంగాల్లో త‌న స‌త్తా చాటారు. ఓ వైపు సినిమాల‌తో బిజీగా ఉంటూనే .....సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌ గా ఉండ‌డం బిగ్ బీకే చెల్లింది. స‌మ‌కాలీన‌ - రాజ‌కీయ‌ - సినీ అంశాల‌పై బిగ్ బీ మార్క్ ట్వీట్‌ లు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తుంటారు. ట్విట్ట‌ర్‌ లో విప‌రీత‌మైన ఫాలోయింగ్ ఉన్న బిగ్ బీ తాజాగా మ‌రో అరుదైన ఘ‌న‌త ద‌క్కించుకున్నారు. ట్విట్ట‌ర్లో ప్ర‌ధాని మోడీ త‌ర్వాత అత్యధిక ఫాలోవ‌ర్లున్న వ్య‌క్తిగా అమితాబ్ నిలిచారు.

ట్విటర్‌ లో అత్యంత చురుకైన బాలీవుడ్ సెలబ్రిటీలలో ఒకరైన అమితాబ్ మ‌రో మైలురాయిని అధిగమించారు. ట్విటర్లో అమితాబ్ ఫాలోవర్ల సంఖ్య 40 మిలియన్లను దాటేసింది. ట్విట్ట‌ర్లో అత్య‌ధిక ఫాలోవ‌ర్లున్న భారతీయ ప్రముఖుల్లో ప్ర‌ధాని మోడీ (50 మిలియన్ల) తరువాత రెండోస్థానంలో అమితాబ్ నిలిచారు. ట్విట్ట‌ర్‌ తో పాటు ఫేస్‌ బుక్‌ - ఇన్‌ స్టాగ్రామ్ వంటి సోషల్‌ మీడియా ప్లాట్‌ ఫాంలలోనూ బిగ్ బీ యాక్టివ్‌ గా ఉంటారు. బిగ్‌ బీకి ఫేస్‌ బుక్‌ లో 27.9 మిలియన్లు - ఇన్‌ స్టాగ్రామ్‌ లో 14.2 మిలియన్లకు పైగా ఫాలోవర్లున్నారు. బిగ్ బీ ఇదే ఊపును కొన‌సాగిస్తే...త్వ‌ర‌లోనే ప్ర‌ధాని మోడీని బీట్ చేసే చాన్స్ ఉంద‌ని ఆయ‌న ఫ్యాన్స్ అభిప్రాయ‌ప‌డుతున్నారు.

బాలీవుడ్‌ స్టార్‌ హీరో షారూఖ్ 39.4 మిలియన్ల మంది ఫాలోవర్లతో మూడవ స్థానంలో ఉన్నారు. బి-టౌన్‌ లో వాణిజ్యపరంగా విజయవంతమైన నటులలో ఒకరైన అక్షయ్ కుమార్ 33.7 మిలియన్ల ఫాలోవర్లను తన ఖాతాలో జోడించుకున్నారు. మరోవైపు  సల్మాన్ ఖాన్‌ కూడా త్వరలో 40 మిలియన్ల బెంచ్ మార్కును చేరుకోనున్నారు.
Tags:    

Similar News