సోషల్ మీడియా విస్తృతం అయ్యాక.. సెలబ్రిటీలు స్టార్లు వాళ్లలో వాళ్లు ఎలా మాట్లాడుకుంటారు.. ఎలా జోకులు వేసుకుంటారనే విషయం జనాలకు తెలిసిపోతోంది. తమ భావాలను పంచుకునేందుకే కాదు.. అవతలి వ్యక్తులను నిలదీసేందుకు కూడా సోషల్ మీడియా బాగా ఉపయోగపడుతోంది.
సీనియర్ హీరో అనిల్ కపూర్ కూతురు.. బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ తాజాగా పుట్టిన రోజు జరుపుకుంది. జూన్ 9న ఈ భామకు 32 ఏళ్ల వయసు నిండింది. తాజాగా సోనమ్ కపూర్ ను బాలీవుడ్ మెగాస్టార్.. ట్విట్టర్ సాక్షిగా నిలదీశారు. అది కూడా జస్ట్ తన మెసేజ్ రిప్లై ఇవ్వలేదని కావడం విశేషం. 'మరి నా సంగతేంటి.? నేను అమితాబ్ బచ్చన్ ని డియర్. నేను నీకు పుట్టిన రోజున ఎస్ ఎంఎస్ పంపితే.. నాకు నువ్వు రిప్లై ఇవ్వలేదు' అని సోనమ్ ని ఉద్దేశించి పోస్ట్ చేశారు అమితాబ్.
దీనికి సోనమ్ సమాధానం కూడా బాగుంది. 'ఓ మై గాడ్.. సార్.. నాకు మెసేజ్ రాలేదు. నేను ఎప్పుడూ తప్పకుండా రిప్లై ఇస్తాను. థాంక్యూ సో మచ్. నాకు అభిషేక్ బచ్చన్ మెసేజ్ వచ్చిందంతే. అయామ్ సో సారీ' అని చెప్పింది సోనమ్ కపూర్. సోనమ్ పుట్టిన రోజున.. 'వెరీ హ్యాపీ బర్త్ డే సోనమ్ కపూర్.. ఈ ఏడాది నీకు గతేడాది కంటే బాగుండాలని కోరుకుంటున్నాం. మా బటర్ చికెన్ భోజనం ఇంకా పెండింగ్ లోనే ఉంది' అంటూ అభిషేక్ తో పాటు.. తల్లి జయా బచ్చన్ ట్వీట్ చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/