ఆ వీడియోతో అక్ష‌య్ అడ్డంగా బుక్!

Update: 2019-05-05 05:49 GMT
నీతులు అంద‌రూ చెబుతారు. కానీ.. చాలామంది చెప్పే మాట‌లు గుండెల్లో నుంచి కాక‌.. నాలుక చివ‌ర్ల నుంచి వ‌స్తుంటాయి.అలాంటివారి కార‌ణంగానే ఈ రోజు దేశం ఇలా త‌గ‌ల‌బ‌డింద‌ని చెప్పాలి. వాణిజ్య సినిమాల్లో సందేశాల్ని ఇస్తూ.. భార‌తీయ‌త‌కు.. దేశ‌భ‌క్తి ఐకాన్ గా బాలీవుడ్ ప్ర‌ముఖ న‌టుడు అక్ష‌య్ నిలుస్తారు.

ప‌లు ఉదాత్త‌మైన మూవీస్ నిర్మించిన అత‌డు.. దేశానికి ఐకాన్ సెల‌బ్రిటీగా ప‌లువురు కీర్తిస్తుంటారు. అయితే.. అత‌డి మాట‌ల‌కు.. దాని వెనుక దాగి ఉన్న షాకింగ్ నిజం ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. అక్ష‌య్ కు భార‌త పౌర‌స‌త్వం లేద‌ని.. అత‌ను కెన‌డా వాసి అన్న నిజం తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ఇంత‌కాలం లేని పౌర‌స‌త్వం గురించి జ‌ర‌గ‌ని చ‌ర్చ ఇప్పుడే ఎందుకు జ‌రిగిందంటే.. దీనికి కార‌ణం లేక‌పోలేదు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ప‌లువురు ప్ర‌ముఖులు తాము ఓటు వేసిన వైనాన్ని ఎంత‌లా  ప్ర‌చారం చేసుకున్నారో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఇదిలా ఉంటే.. ఓట్లు వేయ‌ని ప్ర‌ముఖుల‌కు ఈసారి ప్ర‌శ్న‌లు ఎదుర‌య్యాయి.

సోష‌ల్ మీడియాలో కూడా అక్ష‌య్ మీద ప‌లువురు విమ‌ర్శ‌లు చేశారు. దీనికి సంబంధించి అక్ష‌య్ నోటి నుంచి అనూహ్య వ్యాఖ్య ఒక‌టి వ‌చ్చింది. దేశం ప‌ట్ల త‌న‌కున్న ప్రేమ‌ను నిరూపించుకోవాల్సిన అవ‌స‌రం లేదంటూ ట్వీట్ చేశారు. త‌న పౌర‌స‌త్వం గురించి మాట్లాడుతుంటే త‌న‌కు బాధ‌గా ఉంద‌ని.. ఇక్క‌డే సంపాదిస్తున్నాను.. ఇక్క‌డే ప‌న్నులు క‌డుతున్నాన‌ని వ్యాఖ్యానించారు.

దీనికి కౌంట‌ర్ గా కొంద‌రు నెటిజ‌న్లు.. అక్ష‌య్ కు చెందిన పాత వీడియో ఒక‌టి తెర మీద‌కు తేవటంతో అక్ష‌య్ ఇమేజ్ కు భారీగా డ్యామేజ్ జ‌రిగింది. ఆ వీడియోలో తాను సినిమా ఇండ‌స్ట్రీ నుంచి రిటైర్ అయ్యాక కెన‌డాకు తిరిగి వ‌చ్చేస్తాన‌ని.. ఇక్క‌డే స్థిర‌ప‌డ‌తానంటూ ఒక ఇంట‌ర్వ్యూలో అక్ష‌య్ చెప్పిన వైనాన్ని తెర మీద‌కు తీసుకొచ్చారు. ఈ వీడియోతో అక్ష‌య్ పౌర‌స‌త్వం మీద క్లారిటీ రావ‌టంతో పాటు.. అత‌ను నిత్యం చెప్పే దేశ‌భ‌క్తి ఎంత‌న్న విష‌యంపై స్ప‌ష్ట‌త వ‌చ్చే ప‌రిస్థితి. వైర‌ల్ అవుతున్న ఈ వీడియో అక్ష‌య్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దేశ‌ పౌర‌స‌త్వం లేని సెల‌బ్రిటీకి మోడీ మాష్టారు ఎలా ఇంట‌ర్వ్యూ ఇస్తారంటూ పాయింట్ తీస్తున్న వాళ్లు లేక‌పోలేదు. ఇదిలా ఉంటే.. త‌న పౌర‌స‌త్వం మీద న‌డుస్తున్న ర‌చ్చ‌కు పుల్ స్టాప్ పెట్టేందుకు తాజాగా రియాక్ట్ అయిన అక్ష‌య్.. తాను గ‌డిచిన ఏడేళ్లుగా కెన‌డాకు వెళ్ల‌లేద‌న్నారు. కెన‌డా మీద ఫీలింగ్స్ లేకుంటే దేశ పౌర‌స‌త్వం తీసేసుకోవ‌చ్చు క‌దా..?

వీడియో కోసం క్లిక్ చేయండి

Tags:    

Similar News