2015లో విడుదలైన `పటాస్`తో డైరెక్టర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన అనిల్ రావిపూడి.. తొలి చిత్రంలోనే తన మార్క్ ను చూపించి సూపర్ డూపర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత అనిల్ రావిపూడి రూపొందించిన సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరు చిత్రాలు సైతం మంచి విజయం సాధించాయి. బ్రేకుల్లేని హిట్స్ తో అపజయం ఎరుగని దర్శకుడిగా దూసుకుపోతున్న అనిల్ రావిపూడి.. ఇటీవల `ఎఫ్ 3`తో ప్రేక్షకులను పలకరించాడు.
`ఎఫ్ 2` చిత్రానికి సీక్వెల్ గా `ఎఫ్ 3` రూపుదిద్దుకుంది. ఇందులోనూ విక్టరీ వెంకటేష్-వరుణ్ తేజ్ హీరోలుగా, తమన్నా-మెహ్రీన్ హీరోయిన్లుగా నటించారు. మే 27న విడుదలైన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్.. ఫస్ట్ వీక్ లో అదిరిపోయే కలెక్షన్స్ ను సొంతం చేసుకుని వంద కోట్ల క్లబ్ లోకి చేరింది. కానీ, రెండో వారం వచ్చే సరికి `మేజర్`, `విక్రమ్` చిత్రాలు బరిలోకి దిగడంతో.. `ఎఫ్ 3` కలెక్షన్స్ డ్రాప్ అయిపోయాయి.
బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోవాలంటే.. ఈ చిత్రం ఇంకా కష్టపడాల్సిన అవసరం ఉంది. కానీ, ఇంతలోనే అనిల్ రావిపూడి ఓవర్ కాన్ఫిడెన్స్ తో `ఎఫ్ 4`ను అనౌన్స్ చేసేశాడు. `ఎఫ్ 4` రావడానికి మరో రెండేళ్లయినా పట్టొచ్చని పేర్కొన్న అనిల్ రావిపూడి.. హీరోలుగా వెంకీ-వరుణ్ లే కొనసాగుతారని, హీరోయిన్లు మారే అవకాశం ఉందని రీసెంట్ గా ఓ కార్యక్రమంలో వెల్లడించారు.
అయితే ఇప్పుడు ఈ విషయమే అనిల్ రావిపూడి అభిమానులను కలవర పెడుతోంది. టాలీవుడ్ లో సీక్వెల్స్ కు ఉన్న బ్యాడ్ సెంటిమెంట్ ను అనిల్ రావిపూడి చెరిపేసినా.. ఎఫ్ 2 సినిమా సక్సెస్ అయిన స్థాయిలో ఎఫ్ 3 సినిమా సక్సెస్ సాధించలేదు. పైగా ఫన్ తప్పా ఎఫ్ 3లో కథేమి లేదంటూ ఓ వర్గం ప్రేక్షకులు పెదవి విరిచారు. అయినప్పటికీ అనిల్ రావిపూడి అవేమి పట్టించుకోకుండా `ఎఫ్ 4` ప్రకటించారు.
ఒకవేళ ఈ సినిమా రిజల్ట్ లో ఏదైనా తేడా వస్తే అనిల్ రావిపూడి కెరీర్ డేంజర్ లో పడే అవకాశాలు ఎంతైనా ఉన్నాయని ఫ్యాన్స్ వర్రీ అవుతున్నారు. కాగా, అనిల్ రావిపూడి తన తదుపరి చిత్రాన్ని నటసింహం నందమూరి బాలకృష్ణతో చేయబోతున్న సంగతి తెలిసిందే.
తండ్రీకూతుళ్ల మధ్య సాగే యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రమిది. ఇందులో బాలయ్య 45 ఏళ్లు వయసు గల తండ్రి పాత్రలో నటిస్తే, ఆయన కూతురిగా యంగ్ బ్యూటీ శ్రీలీల అలరించబోతోంది. సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో ఈ మూవీ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి.