సౌత్ ఓ యంగ్ అండ్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న వ్యక్తి అనిరుద్. కోలీవుడ్ లో అయితే నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుద్ కొనసాగుతున్నాడు. అయితే తెలుగులో మాత్రం ఇప్పటి వరకు అనిరుద్ రెండు సినిమాలు మాత్రమే చేశాడు. అవి అజ్ఞాతవాసి, నాని గ్యాంగ్ లీడర్. బ్యాడ్ లక్ ఏంటంటే ఈ రెండు సినిమాలు మ్యూజికల్ హిట్ అయిన కూడా డిజాస్టర్ అయ్యాయి.
దీంతో అనిరుద్ మ్యూజిక్ టేస్ట్ ని తెలుగు ప్రేక్షకులు పూర్తిగా ఆశ్వాదించలేకపోయారు. అతని మ్యూజిక్ గొప్పతనం ఏంటో తెలియాలంటే రౌడీ బాబీ సాంగ్ కి వస్తున్న ఆదరణ చూస్తే చాలు. తెలుగులో తమన్, దేవిశ్రీ ప్రసాద్ హవానే ఇప్పటికి నడుస్తుంది. అయితే ఇప్పుడు అనిరుద్ కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ పైన కూడా దృష్టి పెట్టాడు. స్టార్ హీరోలు పాన్ ఇండియా కథలపై ఫోకస్ చేయడంతో అనిరుద్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్స్ కి డిమాండ్ పెరిగింది. కోలీవుడ్ ప్రేక్షకులకి రీచ్ కావాలనే ఉద్దేశ్యంతో అనిరుద్ ని టాలీవుడ్ హీరోలు మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమా కోసం అనిరుద్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా ఫైనల్ చేశారు.
ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం అనిరుద్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఇక ఎన్టీఆర్ సినిమా కోసం సుమారు 5 నుంచి 6 కోట్ల వరకు అనిరుద్ చార్జ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. నిర్మాతలు కూడా ఈ బడ్జెట్ ని ఇవ్వడానికి రెడీ అయినట్లు సమాచారం. ఈ లెక్కన చూసుకుంటే సౌత్ లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుద్ నిలిచాడని చెప్పాలి. తెలుగులో ఉన్న దేవిశ్రీప్రసాద్, తమన్ మ్యూజిక్ కోసం సుమారు 3 నుంచి 4 కోట్ల వరకు చార్జ్ చేస్తున్నారు. ఇది ఒక చిన్న సినిమా బడ్జెట్ రేంజ్ అని చెప్పాలి. వీరికంటే అనిరుద్ ఎక్కువ చార్జ్ చేయడం సౌత్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇండియాలో హైయెస్ట్ రెమ్యునరేషన్ ఎ.ఆర్.రెహమాన్ తీసుకుంటున్నారు. అతని తర్వాత స్థానంలో అనిరుద్ హైయెస్ట్ పెయిడ్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్నారనే మాట ఇప్పుడు వినిపిస్తుంది.