అభినవ సీతమ్మ అంజలి గురించి తెలియనిది ఎవరికి? తెలుగు లోగిళ్లలో సీతమ్మగా ఫేమస్. షాపింగ్‌మాల్, జర్నీ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, గీతాంజలి సినిమాలతో జనాల్లోకి దూసుకుపోయింది. అయితే అంజలి సినీకెరీర్ గురించి జనాలకు తెలుసు కానీ, వ్యక్తిగత జీవితం గురించి తెలిసింది తక్కువే. అందుకే కాసింత స్వస్థలం గురించి చిన్నప్పటి తీపి గురుతుల గురించి ఇలా చెప్పింది.
నేను రాజోలు పిల్లని. చిన్నప్పట్నుంచి సినిమా హీరోయిన్ అవ్వాలన్నది నా కోరిక. ఊఁళ్లో అంతా నన్ను హీరోయిన్ అని ఆటపట్టిస్తారు. చిన్నప్పట్నుంచి నేను ఫ్యాంటు షర్టు వేసుకుని మగరాయుడిలాగా తిరిగేదాన్ని. జనాలతో గొడవపడేదాన్ని. అంతేకాదు ఓసారి ఓ గడుగ్గాయ్ నాకు ఓ లవ్‌లెటర్ కూడా ఇచ్చాడు. ప్రేమించానని ప్రపోజల్ చేశాడు. అప్పుడు ఎనిమిదో తరగతి చదువుతున్నా. ఎవరైనా ఏమవుతావు? డాక్టరు, ఇంజినీరు, కలకటేరు అని అడిగితే వెంటనే నా సమాధానం హీరోయిన్ అవుతా అని వినిపించేది. అంతే జనాలంతా అవాక్కయ్యేవారు.. అంటూ చిలిపి సంగతులన్నీ చెప్పింది అంజలి.
ఏదో చిన్న విలేజీ. ఏమీ తెలియని వయసు. పదో తరగతి చదివేప్పుడు అనుకుంటా. నేను ఇంట్లోంచి పారిపోయాను. ఏదో కల్చరల్ ప్రోగ్రామ్‌లో డ్యాన్సులు వేసినందుకు అందరూ నన్ను తిట్టారు. అందుకే పారిపోయా. ఆ తర్వాత చాక్లెట్లు, చిక్లెట్లు పెట్టి బొమ్మించి, నమ్మించి ఇంటికి తీసుకొచ్చారు. అది వేరే విషయం అనుకోండి. కాలక్రమంలో నాలోని విషయాన్ని గమనించి అంతా ప్రోత్సహించడం మొదలెట్టారు. అలా ఁహీరోయిన్‌నయ్యా .. అంటూ అంజలి చెప్పుకొచ్చింది.
ఇంటర్ వయసులోనే 'ఫోటో' అనే సినిమాతో తెరంగేట్రం చేశా. ఆ తర్వాత పయనం మీకు తెలిసిందే. ప్రస్తుతం ఓ తెలుగు సినిమా, మూడు తమిళ సినిమాలు, ఒక కన్నడ సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నా.. బాయ్ బాయ్ అంది.