గతేడాది బిగ్గెస్ట్ పజిల్ ఏంటంటే.. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనే. ఆ ఆన్సర్ తెలియాలంటే వచ్చే ఏడాది వరకూ ఆగమంటాడు దర్శకధీరుడు రాజమౌళి. ప్రస్తుతం బాహుబలి2 కి సంబంధించిన క్లైమాక్స్ షూట్ జరుగుతోందంటూ యూనిట్ అప్ డేట్స్ ఇస్తోంది. మొదటి రోజు షూటింగ్ కంప్లీట్ అయ్యాక.. ఓ ఫోటో కూడా విడుదల చేసింది బాహుబలి2 టీమ్.
ప్రజలకు అభివాదం చేస్తున్న ఓ చెయ్యి.. కింద బాహుబలి యూనిట్ ఆ ఫోటోలో కనిపిస్తారు. అయితే.. ఆ చెయ్యి ఒక్కటి చూసి బోలెడన్ని సంగతులు మాట్లాడుకోవచ్చు. అందులో మొదటిది ఆ చెయ్యి ఎవరిది? ఇది తండ్రి పాత్ర అయిన అమరేంద్ర బాహుబలిదే అని చెప్పడానికి బోలెడన్ని ఛాన్సెస్ ఉన్నాయి. చేతికి కనిపిస్తున్న మాహిష్మతి కడియం చూశాక ఈ అనుమానం రాక తప్పదు. ఇది కొడుకు చెయ్యి కావచ్చుగా అనుకోవచ్చు గానీ.. భల్లాలదేవుడి చేతిలో ఉన్న మాహిష్మతి రాజ్యానికి వ్యతిరేకంగా శివుడు పాత్ర పోరాడుతున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.
జై మాహిష్మతి అన్న కాన్సెప్ట్.. భల్లాలదేవుడిని ఓడించాకే శివుడి సొంతమవుతుంది. అంతకుముందే ఆ మాట అనాలంటే.. అది కేవలం తండ్రి పాత్రకే సాధ్యం. పైగా గతంలో ఇంటర్వ్యూలు ఇస్తున్న సమయంలో.. 'బాహుబలిని కట్టప్ప చంపాడని ఎందుకు అనుకుంటున్నారు.. పొడిచాడంతే!' అన్న రైటర్ విజయేంద్ర ప్రసాద్ మాటలు గుర్తు తెచ్చుకుంటే.. ఇప్పుడీ చెయ్యి సీనియర్ బాహుబలిదే అని అర్ధం చేసుకోవచ్చు. సో క్లైమాక్స్ లో ఇద్దరు బాహుబలిలు ఉంటారని ఫిక్స్ అయిపోదామా?