తెలుగు రాష్ట్రాల్లోని రెండు అగ్ర కులాలను వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ టార్గెట్ చేశారు. ఏపీలో అధికారాన్ని చేతుల్లో ఉంచుకునే కమ్మ, రెడ్ల మధ్య సాగుతున్న వైరాన్ని ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ సినిమా లో చూపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన రెండు ట్రైలర్లు తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని వివాదాలు రేపాయో చూశాం. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, కేఏ పాల్, జగన్ ఇలా వీరి పాత్రధారులను పోలిన నటులతో వర్మ సృష్టించిన వివాదం అంతా ఇంతాకాదు.. ఏపీ లో మొన్నటి ఎన్నికల వేళ, అనంతర పరిణామాల పై వర్మ ఈ వివాదాస్పద చిత్రాన్ని తీస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో తనను అవమానించేలా చిత్రీకరించారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ హైకోర్టుకెక్కారు. సినిమా విడుదల ఆపాలని కోరారు. ఈ నెలాఖరున 29న ఈ మూవీని విడుదల చేసేందుకు నిర్ణయించిన సంగతి తెలిసిందే.
తాజాగా రాంగోపాల్ వర్మ తీస్తున్న ‘కడప రాజ్యంలో కడపరెడ్లు’ సినిమాపై మరో పిటీషన్ తెలంగాణ హైకోర్టులో దాఖలైంది. ఈ సినిమా కులాల మధ్య చిచ్చుపెట్టేలా ఉందంటూ.. సినిమా విడుదలను నిలిపివేయాలంటూ ఇంద్రసేన చౌదరి అనే వ్యక్తి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. సినిమా విడుదల అయితే కమ్మ, రెడ్డి కులస్థులు మధ్య గొడవలు జరిగే ప్రమాదం ఉందని.. వెంటనే విచారణ జరపాలని కోర్టు లో పిటీషన్ వేశారు.
ఇక ఈ పిటీషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ధర్మాసనం.. దీనిపై రేపు విచారణ చేస్తామని పేర్కొంది. ఈ నేపథ్యం లో ఈనెల 29న రిలీజ్ కు రెడీ అయిన ‘కమ్మరాజ్యం లో కడపరెడ్లు’ సినిమా విడుదల అవుతుందా లేదా అన్నది ఉత్కంఠ గా మారింది.