కంగన వర్సెస్ బాలీవుడ్ మాఫియా! వార్ గురించి తెలిసిందే. పురుషాధిక్య ప్రపంచంపై క్వీన్ దండయాత్రి నిరాఘంటంగా కొనసాగుతోంది. దొరికినవాళ్లందరినీ దొరకబుచ్చుకుని చెడుగుడు ఆడేస్తోంది కంగన. ఇక ఈ గుంపులో ట్యాలెంటెడ్ అనురాగ్ కశ్యప్ కూడా అనుకోకుండా దొరికిపోతున్నారు. ఇక కంగన వర్సెస్ అనురాగ్ వార్ గురించి ఏమని చెప్పాలి. ఎంతని చెప్పాలి?
ఆ ఇద్దరూ ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకుంటూ పంచ్ లతో పూరీనే మించిపోతున్నారు. తాజాగా అనురాగ్ కశ్యప్ కంగనపై వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. దాని సారాంశం ఇలా ఉంది. ``కంగనా రనౌత్.. నువ్వు నిజమైన మణికర్ణికవా? అయితే చైనాతో పోరాడండి`` అంటూ కెలికాడు. కంగన అంతకుముందు చేసిన ఓ వెటకారపు ట్వీట్ కు అతడి రిప్లయ్ ఇది. ``తాను శత్రువులకు నమస్కరించనని.. ఆత్మగౌరవంతో జీవిస్తున్నానని కంగన అనడంతో అతడు పైవిధంగా సోషల మీడియాల్లో ఛాలెంజ్ చేశారు.
అనురాగ్ ఇంకా ఏమని అన్నారంటే ఆ మెసేజ్ లో...! ``మీరు ఒక్కరే సోదరి .. నిజమైన మణికర్ణిక. మీతో నలుగురు లేదా ఐదుగురు వ్యక్తులను తీసుకొని వెళ్లి చైనాతో పోరాడండి. చైనీలు మన భూభాగం లోపలికి ఎంత దూరం వచ్చారో చూడండి. అలా చేసి ఎదురెళ్లి భారతదేశం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చూపించండి. మమ్మల్ని రక్షించడానికి మీరు అక్కడ ఉన్న సమయం ఎంతంటే..! మనాలీలో మీ ఇంటి నుండి ఒక రోజు ప్రయాణం మాత్రమే. వెళ్ళండి.. మా పులికి జై హింద్`` అంటూ వ్యంగ్యంగా పంచ్ లు వేశారు.
దీనికి కంగన నుంచి ట్వీట్ ఇలా ఉంది, ``నేను ఒక యోధురాలినే. నా తల తెగిపోవడానికి నేను అనుమతించగలను. కానీ శత్రువుకు నమస్కరించను. నా దేశం ఆత్మగౌరవం కోసం నేను ఎల్లప్పుడూ నా స్వరాన్ని పెంచుతాను. నేను గౌరవం.. స్వీయ- గౌరవం ఉన్న జాతీయవాదిగా గర్వంగా జీవిస్తాను! నా సూత్రాలతో నేను ఎప్పటికీ రాజీపడను. నేను ఎప్పటికీ రాజీకి రాను! జై హింద్`` అంటూ ప్రతిదాడికి దిగింది క్వీన్.
తనను తాను `యోధురాలు` ..`జాతీయవాది` అని ప్రకటించుకున్న కంగనను `ఏకైక మణికర్ణిక` అంటూ అనురాగ్ వ్యంగ్యంగా సెటైర్ వేసేశాడు. దానికి కౌంటర్ గా `అతడు తెలివితక్కువవాడు` అంటూ కౌంటర్ వేసింది క్వీన్. వ్వారెవ్వా.. ఇది సినిమాని మించిపోయింది అంటూ వినోదం చూడడం నెటిజనుల వంతైంది.