కింగ్‌ కోసం స్వీటీ కామియో

Update: 2015-05-26 07:30 GMT
స్వీటీ అనుష్క 'రుద్రమదేవి 3డి', 'బాహుబలి' వంటి క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. వీటితో పాటు 'సైజ్‌ జీరో' చిత్రంలో ఓ అతిధి పాత్రలో మెరవనుంది. కె.రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్‌ కోవెలమూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు కింగ్‌ నాగార్జున, కార్తీల మల్టీస్టారర్‌లోనూ అతిధి పాత్రలో నటించేందుకు స్వీటీ ఆసక్తి కనబరిచిందిట.

ఇంకా టైటిల్‌ నిర్ణయించని ఈ సినిమా 2011 ఫ్రెంచి కామెడీ డ్రామా 'ఇన్‌టచబుల్స్‌' ఇన్‌స్పిరేషన్‌తో తెరకెక్కిస్తున్నామని మేకర్స్‌ చెప్పారు. నాగ్‌ ఈ చిత్రంలో వీల్‌ చైర్‌లోంచి కదలలేని క్వాడ్రిప్లెజిక్‌ రోగగ్రస్తుడిగా నటిస్తున్నారు. తమన్నా ప్రధాన నాయిక. శ్రుతిహాసన్‌ ఐటెమ్‌లో నర్తించనుంది. ఇప్పుడు అతిధి పాత్రకు తెలిసిన ముఖం అయితే బావుంటుందని భావించి స్వీటీకి ఛాన్సిచ్చారు. కామియో పాత్ర తీరుతెన్నుల్ని దర్శకుడు వంశీ పైడిపల్లి నేరేట్‌ చేసినప్పుడు వెంటనే అనుష్క ఎగ్జయిట్‌ అయ్యి ఓకే చెప్పేశారని చెబుతున్నారు

పివిపి సినిమాస్‌లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. పీవీపీ నిర్మిస్తున్నారు. సైజ్‌ జీరో చిత్రానికి కూడా ఆయనే నిర్మాత. ఇదే సంస్థ కాబట్టి అనుష్క వెంటనే ఎగ్జయిట్‌ అయ్యిందా? లేక కింగ్‌ నాగార్జునతో స్నేహం కొద్దీ ప్రాజెక్టుకు కమిటైందా? లేక పారితోషికం టూ ఇన్‌ వన్‌లో ముడిపెట్టి పీవీపీ కొత్త ప్లాన్‌ చెప్పారా? అన్నది తేలాల్సి ఉంది. స్వీటీ మైకు ముందుకు వస్తేనే అసలు వివరం తెలిసేది.

Tags:    

Similar News