పిల్లలను మేం ఇలాగే పెంచుతాం : అనుష్క

Update: 2020-12-31 11:08 GMT
బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ త్వరలో తల్లికాబోతున్న విషయం తెలిసిందే. కొత్తగా తల్లికాబోతున్న ప్రతీ మహిళ తమ పిల్లల భవిష్యత్ పై ఎన్నో కలలు కనడం సహజం. ఇదే విషయం మాట్లాడిన అనుష్క.. తమ సంతానాన్ని ఎలా పెంచాలనుకుంటోందో వివరించింది.

తాను అభ్యుదయ భావజాలం ఉన్న కుటుంబం నుంచి వచ్చానని చెప్పిన అనుష్క.. తన సంతానాన్ని కూడా అలాగే పెంచుతానని చెప్పింది. ఇతరులను గౌరవించేలా విలువలు నేర్పుతానని పేర్కొంది. ఈ క్రమంలో.. పిల్లలతో పైకి కాస్త కఠినంగా వ్యవహరించినట్లుగా కనిపించినా అందులో ప్రేమ ఇమిడి ఉందనే నిజాన్ని వారికి తెలిసేలా చేస్తానని చెప్పుకొచ్చారు.

జనవరిలో అనుష్కకు వైద్యులు డెలివరీ డేట్‌ ఇచ్చారు. తొలి సంతానపు మధురానుభూతలతో కొత్త సంవత్సరానికి ఈ స్టార్‌ కపుల్‌ స్వాగతం పలుకనున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ ఫ్యాషన్‌ మ్యాగజీన్‌ వోగ్‌ ఇండియా నిర్వాహకులు అనుష్క శర్మతో మెటర్నిటీ ఫొటోషూట్‌ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘దాదాపుగా అన్ని విషయాల్లో మా ఇద్దరి (కోహ్లీ-అనుష్క) ఆలోచనలు ఒకే విధంగా ఉంటాయి. తల్లిదండ్రులుగా మారక ముందు నుంచే పేరెంటింగ్‌పై మాకు ఒక అవగాహన ఉంది. నేను అభ్యుదయ భావాలు గల కుటుంబం నుంచి వచ్చాను. ఇప్పుడు నా ఇంట్లో కూడా అదే వాతావరణం ఉంటుంది. మా పిల్లలు ఇతరులకు గౌరవం ఇచ్చేలా పెంచుతాం. విలువలతో కూడిన జీవనం సాగించేలా తీర్చిదిద్దుతాం. ఆకతాయిలుగా పెంచడం మాకు ఇష్టం లేదు’’ అని అన్నారు.

కాగా.. అనుష్క తాజా ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ చిత్రాల్లో గర్భానికి అనువైన దుస్తులు ధరించి ఉన్నారు అనుష్క శర్మ. ఈ ఫొటోలకు పలువురు సినీ సెలబ్రిటీలు కాంప్లిమెంట్ ఇస్తున్నారు. వారితోపాటు కోహ్లి సైతం.. ‘అందంగా ఉన్నావు’ అంటూ భార్యకు కాంప్లిమెంట్‌ ఇచ్చాడు.
Tags:    

Similar News