స్టార్‌ మ్యూజిక్ డైరెక్టర్ తనయుడికి తృటిలో తప్పిన ప్రమాదం

Update: 2023-03-06 17:00 GMT
సౌత్ కు చెందిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కి ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు అనడంలో సందేహం లేదు. ఏఆర్‌ రహమాన్ యొక్క తనయుడు రమీన్‌ కూడా తన సంగీతంతో మరియు పాటలతో అలరిస్తూ వస్తున్నాడు.

తన టీమ్ తో కలిసి మ్యూజిక్‌ ఆల్బం చేస్తూ వస్తున్న రమీన్ ఇటీవల ముంబైలోని ఒక ఫిల్మ్‌ స్టూడియోలో మ్యూజిక్ ఆల్బం చేస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది.

మ్యూజిక్‌ ఆల్బం చిత్రీకరణ సందర్భంగా ప్రమాదం జరిగిందని స్వయంగా రమీన్‌ సోషల్‌ మీడియా ద్వారా తెలియజేశాడు. ప్రస్తుతం అంతా సేఫ్ గా ఉన్నామని.. తృటిలో పెద్ద ప్రమాదం తప్పిందని ఆయన పేర్కొన్నాడు. టీమ్‌ లో కొందరు తీవ్ర గాయాలు అవ్వడంతో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని కూడా రమీన్ పేర్కొన్నాడు.

ఈ ప్రమాదం పై రెహమాన్ కూడా స్పందించారు. తన తనయుడు రమీన్ మరియు అతడి టీమ్‌ మ్యూజిక్ ఆల్బం చిత్రీకరిస్తున్న సమయంలో క్రేజ్ కు ఏర్పాటు చేసిన లైట్స్ కుప్పకూలాయి అని.. దేవుడి దయవల్ల ప్రాణ నష్టం జరగలేదు అని.. కానీ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని రహమాన్‌ పేర్కొన్నాడు.

ఇండియన్ సినీ పరిశ్రమ చాలా అభివృద్ధి చెందింది. ఇలాంటి సమయంలో ఇంకా ఇలాంటి ప్రమాదాలు జరగడం మంచిది కాదని.. చిత్ర నిర్మాతలతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ప్రమాదాలు ముందు ముందు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత తీసుకోవాలని సూచించారు. ఈ ప్రమాదం విషయమై ప్రస్తుతం ఎంక్వైరీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.         



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News