వ్వాట్‌! కంగ‌న నుంచి నేర్చుకున్నాన‌న్న స్వామి!!

Update: 2021-09-06 05:32 GMT
క్వీన్ కంగ‌న ర‌నౌత్ లోని డ్యాషింగ్ యాటిట్యూడ్ కి రెబ‌లిజానికి అభిమానులు ఉన్న సంగ‌తి తెలిసిందే. నిరంత‌రం వివాదాల‌తో అంట‌కాగే కంగ‌న ఖాతాలో మరో పెద్ద అభిమాని చేరారు. ఆయ‌నే ది గ్రేట్ అర‌వింద స్వామి. ఆయ‌న సాక్షాత్తూ `త‌లైవి` ప్ర‌మోష‌న్స్ లో వేదిక‌పై మాట్లాడుతూ.. కంగ‌న జ‌య‌ల‌లిత పాత్ర‌లో ఒదిగిపోయి న‌టించార‌ని త‌న నుంచి ఎంతో నేర్చుకున్నాన‌ని ప్ర‌శంసించేయ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. అర‌వింద స్వామి ఎంతో సీనియ‌ర్ న‌టుడు. లెజెండ‌రీ ద‌ర్శ‌కులు మ‌ణిర‌త్నం స‌హా టాప్ రేంజు ద‌ర్శ‌కుల‌తో ప‌ని చేసారు. కానీ ఆయ‌న ఎంతో ఒదిగి ఇలా కంగ‌న‌ను పొగిడేయ‌డంపై అభిమానుల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

ఇక త‌లైవి చిత్రంలో అర‌వింద స్వామి ఎంజీఆర్ పాత్ర‌లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. త‌లైవి తెలుగు వెర్ష‌న్ ట్రైల‌ర్ ఆవిష్క‌ర‌ణ‌లో పాల్గొన్న అర‌వింద స్వామి కంగ‌న‌ను బాహాటంగా పొగిడేశారు. అర‌వింద స్వామితో పాటు విజ‌యేంద్ర ప్ర‌సాద్ సైతం తాను కంగ‌న అయితేనే ఈ చిత్రానికి సూట‌బుల్ అంటూ సూచించాన‌ని తాను త‌ప్ప ఇంకెవ‌రినీ ఊహించుకోలేన‌ని అనడం ఆస‌క్తిని క‌లిగించింది.

అస‌లు త‌నను ఆ పాత్ర‌లో అస్స‌లు ఊహించ‌లేద‌ని కంగ‌న సైతం ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు. కంగనా రనౌత్ - అరవింద్ స్వామి ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటించిన `తలైవి` సెప్టెంబర్ 10న తెలుగు- తమిళం-హిందీలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కంగ‌న‌ను సిఫార‌సు చేసి  ఆమె తనలాగే ఉండమని త‌న‌లాగే న‌టించ‌మ‌ని అడిగానని వేదిక‌పై విజ‌యేంద్ర ప్ర‌సాద్ అన్నారు. కంగ‌న అగ్ర‌ప‌థాన నిలుస్తుంద‌ని ఊహించానని విజ‌యేంద్రుడు కీర్తించారు.

లెజెండరీ ఎంజీఆర్ పాత్ర‌లో న‌టించిన‌ అరవింద్ స్వామి కంగ‌న స‌హా ద‌ర్శ‌కుడు ఏ.ఎల్ విజ‌య్ పైనా ప్ర‌శంస‌లు కురిపించారు ``తలైవి నా హృదయానికి దగ్గరగా ఉన్న చిత్రం. కంగన వంటి అద్భుతమైన కళాకారిణితో ఒక గొప్ప అభ్యాస అనుభవం. నేను కొన్ని రోజుల క్రితం సినిమా చూశాను. నిన్న మరోసారి చూశాను. ఇది అసాధారణ అనుభవం``అని అన్నారు.

కంగనా రనౌత్ మాట్లాడ‌తూ.. నన్ను ఇలాంటి గొప్ప పాత్ర‌కు ఎంపిక చేసి విజయవంతంగా ముందుకు తీసుకెళ్లినందుకు విజయేంద్ర ప్రసాద్ గారికి నేను కృతజ్ఞురాలిని. నన్ను నమ్మినందుకు కృతజ్ఞతలు చెబితే స‌రిపోదు. జయ అమ్మ లాంటి బలమైన స్త్రీ పాత్ర‌లో నటించడం నా అదృష్టం. అరవింద్ స్వామి స్త్రీ ఆధారిత చిత్రాన్ని ప్రోత్సహించడం చాలా గొప్ప‌త‌నం దయతో సాధ్య‌మైన‌ది. నేను పనిచేసిన అత్యంత ప్రతిభావంతులైన దర్శకుడు AL విజయ్ కు ధన్యవాదాలు. థియేటర్లలోకి ఆహ్వానిస్తున్నాను. అందరికీ నా ధన్యవాదాలు`` అని అన్నారు. ఈ వేదిక‌పై విజ‌యేంద్ర ప్ర‌సాద్ పై కంగ‌న కృత‌జ్ఞ‌తా భావాన్ని వ్య‌క్తం చేయ‌డ‌మే గాక‌.. ద‌ర్శ‌కుడు ఏఎల్ విజ‌య్ ని కీర్తించ‌డం ఆస‌క్తిని క‌లిగించింది. ప‌చ్చ కోక‌లో అమ్మ జ‌య‌ల‌లిత‌ను త‌ల‌పించే వేష‌ధార‌ణ‌తో కంగ‌న చిరున‌వ్వులు చిందిస్తూ వేదిక‌పై క‌నిపించారు.

ఇదే వేదిక‌పై సీనియ‌ర్ న‌టి భాగ్య‌శ్రీ‌.. క‌థానాయిక పూర్ణ త‌లైవి గురించి మాట్లాడారు. భాగ్యశ్రీ మాట్లాడుతూ.. ``ముందుగా అందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు. నాకు తెలిసి గత రెండేళ్లుగా ఈ తలైవి సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారని అనుకుంటున్నా. ఈ సినిమాలో నటించిన కంగనా రనౌత్.. అరవింద్ స్వామి ఎంతో బాగా నటించారు. ఈ సినిమాలో భాగం కావడం పట్ల చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. నేను ఈ సినిమాలో భాగం కావడంలో కీలక భూమిక పోషించిన విజయ్ సార్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా`` అన్నారు. పూర్ణ మాట్లాడుతూ.. ``ఇలాంటి ప్రాజెక్ట్ లో పని చేయడమే గొప్ప విషయం. శశికళ పాత్రను పోషించడం ఆనందంగా ఉంది. కంగనా మేడంతో పని చేయడం కల నిజమైనట్టు అనిపిస్తోంది. ఆమె నుంచి ఎంతో నేర్చుకున్నాను`` అని అన్నారు.
Tags:    

Similar News