ఒకరంటే ఒకరికి అసలేమాత్రం పడకపోతే తప్ప ఓ జంట విడాకులకు వెళ్లదు. మరి విడాకులు తీసుకున్నాక ఒకరినొకరు కలవడానికి ఎంత వరకు ఇష్టపడతారు? కానీ బాలీవుడ్ జంటలు మాత్రం ఈ విషయంలో చిత్రంగా ప్రవర్తిస్తున్నాయి. ఆల్రెడీ హృతిక్ రోషన్.. సుసానె ఖాన్ విడాకుల తర్వాత ఎంత సన్నిహితంగా ఉంటున్నారో చూస్తున్నాం. పిల్లల కోసమో.. మరో కారణమో.. ఇద్దరూ ఒకరి పుట్టిన రోజులకు ఒకరు వస్తున్నారు. వీకెండ్ డిన్నర్లకు అటెండవుతున్నారు. ఫారిన్ టూర్లకు కూడా వెళ్తున్నారు. ఇదంతా చూసి హృతిక్-సుసానె విడాకులు తీసుకునే జంటలకు ఆదర్శం అంటూ పొగిడేస్తున్నారు.
హృతిక్.. సుసానెలను చూసి స్ఫూర్తి పొందారో ఏమో కానీ ఇప్పుడు సల్మాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్.. అతడి భార్య మలైకా అరోరా కూడా ఇలాగే ప్రవర్తిస్తున్నారు. ఈ జంట ఇటీవలే విడాకుల కోసం కోర్టు మెట్లెక్కిన సంగతి తెలిసిందే. వీళ్లిద్దరినీ కలపడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగిన ఫలించలేదన్న సంగతి తెలిసిందే. మరి అలా విడిపోవడానికి రెడీ అయిన ఈ జంట.. తాజాగా గోవాలో ఒక పార్టీలో ఓ రేంజిలో ఎంజాయ్ చేసింది. వీళ్లిద్దరి కామన్ ఫ్రెండ్స్ ఏర్పాటు చేసిన పార్టీలో అర్బాజ్.. మలైకా సన్నిహితంగా మెలిగారు. మరి ఈ పార్టీకి అర్థమేంటో అర్బాజ్.. మలైకాలే చెప్పాలి. విడాకుల నేపథ్యంలో ఇది బ్రేకప్ పార్టీ అనుకోవచ్చా?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/