సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖులు కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. బాలీవుడ్ స్టార్ అమితాబచ్చన్ ఆయన తనయుడు అభిషేక్ బచ్చన్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ మరియు ఆమె కూతురు ఆరాధ్యకు కూడా కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయ్యింది. ఇంకా పలువురు సినీ ప్రముఖులు కూడా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా హీరోయిన్ ఐశ్వర్య అర్జున్ కు కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె ట్విట్టర్ ద్వారా తెలియజేసింది.
సౌత్ స్టార్ హీరో అయిన అర్జున్ కూతురు ఐశ్వర్య అర్జున్ కాస్త అనారోగ్యంగా ఉండటంతో పరీక్షలు నిర్వహించుకోగా ఆమెకు కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయ్యింది. ఆ కారణంగా ఇటీవల తనను కలిసిన వారంతా కూడా కరోనా నిర్థారణ పరీక్షలు చేయించుకుని సేఫ్ గా ఉండాలంటూ ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం తాను హోం ఐసోలేషన్ లో ఉన్నానని వైధ్యుల సలహాల మేరకు తాను జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చింది.
ఐశ్వర్యకు కరోనా ఎక్కడి నుండి వచ్చింది.. ప్రస్తుతం ఆమె తండ్రి అర్జున్ పరిస్థితి ఏంటా అంటూ అంతా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అర్జున్ ఆరోగ్య విషయమై కొందరు ఆందోళన చెందుతున్నారు. కాని ఆయనకు ఎలాంటి ఇబ్బంది లేదని కన్నడ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఐశ్వర్య అర్జున్ కూడా త్వరలో కోలుకుని తిరిగి యాక్టివ్ గా ఉంటుందని ఆమెను మళ్లీ సినిమాల్లో చూడాలని అభిమానులు ఎదురు చూస్తున్నారు.