'ఆచార్య' లో అరవింద్‌ స్వామి

Update: 2020-11-24 05:45 GMT
తమిళ నటుడు.. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు అయిన అరవింద స్వామి ఇప్పటికే రామ్‌ చరణ్‌ 'ధృవ' సినిమాలో నటించి మెప్పించిన విషయం తెల్సిందే. ఈయన త్వరలో ఆచార్య సినిమాలో నటించబోతున్నాడు. చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్వకత్వంలో రూపొందబోతున్న సినిమాలో అరవింద స్వామి విలన్‌ గా నటించనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే కొరటాల శివ మరియు అరవింద స్వామిల మద్య చర్చలు జరిగాయట. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించబోతున్నారు.

ప్రస్తుతం సినిమా షూటింగ్‌ లో చిరంజీవితో పాటు సోనూసూద్‌ నటిస్తున్నాడు. సినిమాలో సోనూసూద్‌ తో పాటు మరో విలన్‌ నటించబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. ఆ పాత్రకు అరవింద్‌ స్వామిని ఎంపిక చేసే విషయమై చర్చలు దాదాపుగా పూర్తి అయ్యాయి. దేవాలయాల్లో జరుగుతున్న అవినీతిపై ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. రామ్‌ చరణ్‌ కీలక పాత్రలో కనిపించబోతున్న ఈ సినిమాలో హీరోయిన్‌ గా కాజల్‌ అగర్వాల్‌ నటించబోతుంది. రెజీనా ఐటెం సాంగ్‌ లో కనిపించబోతున్నట్లుగా సమాచారం. ఈ సినిమా వచ్చే సమ్మర్‌ లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ప్లాన్‌ చేస్తున్నారు.
Tags:    

Similar News