ముంబై డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కు గురువారం బెయిల్ మంజూరైన విషయం తెలిసిందే. ఆర్యన్ బెయిల్ పై విచారణ జరిపిన బాంబే హైకోర్టు.. అతడితో పాటు మరో ఇద్దరికి బెయిల్ ఇచ్చింది. దీంతో ఆర్యన్ ఈరోజు శుక్రవారం రిలీజ్ అవుతాడని అందరూ ఆశించారు. అయితే ఆర్యన్ మరో రాత్రి జైలులోనే గడపవలసిన పరిస్థితి ఏర్పడింది.
ఆర్యన్ ఖాన్ తరపు లీగల్ టీమ్ సకాలంలో బెయిలు పత్రాలను జైలు అధికారులకు సమర్పించలేకపోవడంతో శుక్రవారం ఆయన విడుదల కాలేకపోయారు. దీంతో ఆర్యన్ విడుదల శనివారానికి పోస్ట్ పోన్ చేసినట్లు ఆర్థర్ రోడ్ జైలు అధికారులు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం సాయంత్రం 5.30 గంటలలోగా బెయిల్ పేపర్ వర్క్ ను పూర్తి చేయవలసి ఉండగా.. వారు ఆ పనిని ఆలస్యంగా పూర్తి చేసారని తెలుస్తోంది.
ఆర్యన్ ఖాన్ కు జామీను ఇచ్చిన నటి జుహీ చావ్లా ఫొటోలు రెండు అవసరం ఉండగా.. లీగల్ టీమ్ వాటిని సబ్మిట్ చేయలేకపోయింది. ఆమె ఫొటోలను తీసుకొచ్చి, పేపర్ వర్క్ ను పూర్తి చేసేసరికి సమయం మించిపోయింది. బెయిలు పేపర్లను గడువు ముగిసిన తర్వాత జైలు వెలుపల ఉండే బెయిల్ బాక్స్ లో వేసినందున ఆర్యన్ మరో రాత్రి ఆర్థర్ రోడ్ జైలులోనే గడపాల్సిన పరిస్థితి వచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు లాంఛనాలన్నీ పూర్తి చేసిన అనంతరం ఆర్యన్ ను రేపు శనివారం జైలు అధికారులు విడుదల చేయనున్నారు.
ఇకపోతే ఆర్యన్ ఖాన్ కు బెయిల్ రావడం పట్ల జామీను ఇచ్చిన జుహీ చావ్లా ఆనందం వ్యక్తం చేశారు. సెషన్స్ కోర్టు వెలుపల ఆమె మాట్లాడుతూ ఆర్యన్ త్వరలోనే ఇంటికి రాబోతుండటం తనకు సంతోషంగా ఉందని.. ఇది అందరికీ గొప్ప ఉపశమనం కలిగిస్తుందని అన్నారు.
ఇదిలా ఉంటే ఆర్యన్ ఖాన్ కు బెయిల్ ఇవ్వడానికి బాంబే హైకోర్టు 14 షరతులను విధించింది. లక్ష రూపాయల వ్యక్తిగత బాండ్ చెల్లించడంతో పాటుగా.. ఒకరు లేదా ఇద్దరు వ్యక్తుల పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. ముంబయిలోని ఎన్డీపీఎస్ కోర్టు వద్ద పాస్ పోర్టును సరెండర్ చేయాలని.. ఎన్డీపీఎస్ ప్రత్యేక కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని సూచించింది. గ్రేటర్ ముంబయి దాటి వెళ్లాలంటే దర్యాప్తు అధికారికి సమాచారం ఇవ్వాలి. ఎక్కడికి వెళ్తున్నారో ఆ వివరాలను సమర్పించాలి.
ఆర్యన్ ఖాన్ ఎలాంటి డ్రగ్స్ కార్యకలాపాల్లో పాల్గొనరాదు. ఈ కేసులో ఇతర నిందితులతో మాట్లాడేందుకు ప్రయత్నించకూడదు. సాక్షులను, ఆధారాలను ప్రభావితం చేసేలా ప్రవర్తించకూడదు. ఈ కేసుకు సంబంధించిన విషయాలపై మీడియాతో మాట్లాడకూడదు. ప్రతి శుక్రవారం ఎన్సీబీ ఆఫీస్ లో ఉదయం 11గంటలు - మధ్యాహ్నం 2గంటల మధ్య హాజరు కావాలి. కోర్టు విచారణకు అన్ని తేదీల్లోనూ హాజరుకావాలి. ఎన్సీబీ అధికారులు విచారణకు ఎప్పుడు పిలిచినా సహకరించాలి. వీటిని ఆర్యన్ ఖాన్ ఉల్లంఘించిన యెడల బెయిల్ రద్దు చేయాలంటూ ఎన్సీబీ అధికారులు కోర్టును కోరవచ్చు వంటి షరతులను కోర్టు విధించింది.
కాగా, అక్టోబరు 2న క్రూయిజ్ షిప్ పై దాడి చేసిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సిబి) డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ ను అరెస్ట్ చేసింది. నిషేధిత డ్రగ్స్ కలిగి ఉండటం - మాధకద్రవ్యాల అమ్మకం/కొనుగోలుకు సంబంధించి నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ (NDPS) సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. అప్పటి నుంచి ఆర్యన్ ఆర్ధర్ రోడ్ జైలులో ఉన్నాడు. ఆర్యన్ బెయిల్ పిటిషన్ ను కోర్టు రెండుసార్లు తిరస్కరించింది. ఈ క్రమంలో మూడోసారి బెయిల్ మంజూరు అయింది. ఆర్యన్ ఖాన్ కు ఎట్టకేలకు బెయిల్ దొరకడంతో షారుఖ్ ఖాన్ సంతోషంగా ఉన్నారు. ఆయన అభిమానులు షారుక్ నివాసం మన్నత్ వెలుపల బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.