పూరి మ్యూజింగ్స్: 3000 మంది బిలియనీర్స్ స్టోరి
ఇటీవల పూరి మ్యూజింగ్స్ పాడ్ కాస్ట్‌లోను అలాంటి మాటల మాయాజాలం కనిపిస్తోంది. ఇప్పటికే పూరి చాలా మ్యూజింగ్స్ అందించారు.
స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దక్షిణాదిలోనే ఉత్తమ మాటల రచయిత. సూటిగా గుచ్చుకునేలా స్ట్రైకింగ్ పంచ్ డైలాగులు రాయడంలో అతడిని కొట్టేవాళ్లే లేరు. అతడి మాట తీరుకు, రచనా శైలికి గొప్ప అభిమానులున్నారు. తెరపై పూరి హీరోలు డైలాగులతోనే గూస్ బంప్స్ తెస్తారు. పవన్ కల్యాణ్, రవితేజ, మహేష్, ఎన్టీఆర్, చరణ్ ఇలా ఎందరో స్టార్ల నుంచి మాస్ ని బయటకు రప్పించినది పూరి డైలాగులే.
ఇటీవల పూరి మ్యూజింగ్స్ పాడ్ కాస్ట్‌లోను అలాంటి మాటల మాయాజాలం కనిపిస్తోంది. ఇప్పటికే పూరి చాలా మ్యూజింగ్స్ అందించారు. అవన్నీ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా `పూరి స్టైల్ ఆఫ్ డైలాగ్ డెలివరీ` అందరినీ కట్టి పడేస్తుంది. ఇప్పుడు ప్రపంచంలోని బిలియనీర్స్ గురించి స్పెషల్ స్టోరిని పూరి మ్యూజింగ్స్ లో అందించారు. పూరి చెప్పిన మాటలు ఇలా ఉన్నాయి.
``కాసేపు అదృష్టవంతుల గురించి మాట్లాడుకుందాం. ప్రస్తుతం ప్రపంచంలో దాదాపు 3000 మంది బిలియనీర్లు ఉన్నారు. వాళ్లందరి ఆస్తి కలిపితే ఎన్నో ట్రిలియన్ డాలర్స్. ప్రపంచంలోని సగం సంపద అంతా ఈ మూడు వేల మంది దగ్గరే ఉంది. ఎక్కువమంది బిలియనీర్స్ టెక్నాలజీ, ఫైనాన్స్, రియల్ ఎస్టేట్, రిటైల్ నుంచి వచ్చారు. ఎవరికి వారు కష్టపడి పైకి వచ్చిన వాళ్లే 75శాతం మంది ఉన్నారు. ఇతరులు వారసత్వ ఆస్తులను అనుభవిస్తున్నవారు. న్యూయార్క్, హాంకాంగ్, మాస్కో, ముంబై వీటిని బిలియనీర్స్ సిటీస్ అని పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడే ఎక్కువ మంది బిలియనీర్స్ ఉన్నారు.
వీరంతా దేవుడి ముద్దు బిడ్డలు. ఏమీ లేకపోయినా ఏదో ఒక రోజు దేవుడు మిమ్మల్ని కూడా ముద్దాడుతాడు. కానీ ఆరోజు అనుభవించడానికి ఆరోగ్యం ఉండాలి. ఎండలో అడుక్కోవడానికి కూడా ఎంతో కొంత ఆరోగ్యం కావాలి..`` అంటూ పాడ్ కాస్ట్ ని చివరి పంచ్ లైన్ తో ముగించాడు.
కెరీర్ మ్యాటర్ కి వస్తే... పూరి తెరకెక్కించిన లైగర్, డబుల్ ఇస్మార్ట్ ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. కొంత నిరాశ తర్వాత పూరి కొత్త స్క్రిప్టులు రాసే పనిలో ఉన్నాడు. తదుపరి ప్రాజెక్ట్ గురించి పూరి వెల్లడించాల్సి ఉంది.