పిక్‌టాక్ : ఈయన వయసు 73 ఏళ్లా...? 37 ఏళ్లా..?
ఇండియన్ సినీ స్టార్స్‌లో మోస్ట్ సీనియర్ స్టార్‌గా గుర్తింపు దక్కించుకున్న మమ్ముట్టీ ఇప్పటికీ వరుసగా సినిమాలు చేస్తున్నారు
1980 నుంచి మలయాళ సినిమా ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్న స్టార్ మమ్ముట్టి. ఇండియన్ సినీ స్టార్స్‌లో మోస్ట్ సీనియర్ స్టార్‌గా గుర్తింపు దక్కించుకున్న మమ్ముట్టీ ఇప్పటికీ వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఏడాదికి కనీసం రెండు మూడు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్న ఈయన వారసులు ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. మమ్ముట్టీ తనయుడు దుల్కర్ సల్మాన్ పాన్ ఇండియా స్థాయిలో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకు పోతున్న విషయం తెల్సిందే. దుల్కర్ సల్మాన్‌కి ఏమాత్రం తక్కువ కాకుండా మమ్ముట్టీ సినిమాల జోరు జాతర కొనసాగుతోంది. మమ్ముటీ తాజాగా ఈ పోటోతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు.
ఈమధ్య కాలంలో మమ్ముట్టీ కాస్త వయసు ఎక్కువ ఉన్న పాత్రల్లో కనిపిస్తున్నారు. కానీ హఠాత్తుగా ఈ ఫోటోలో చూడగానే చాలా మంది షాక్ అయ్యారు. మమ్ముట్టీ వయసు 73 ఏళ్లు అని గూగుల్‌లో చూపిస్తుంది. కానీ ఈ ఫోటోలో చూస్తే ఆయన వయసు 37లా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ వయసులో సాధారణంగా ఎక్కువ శాతం మంది కనీసం లేవడానికి కూడా ఇబ్బంది పడతారు. అలాంటిది మమ్ముట్టీ మాత్రం మూడు పదుల వయసు లుక్‌తో ఆకట్టుకుంటున్నారు. అంతే కాకుండా మూడు పదుల వయసులో ఉన్న హీరోలు ఎంత ఉత్సాహంతో సినిమాలు చేస్తారో అదే ఉత్సాహంతో సినిమాలు చేయడంను చాలా మంది ఆశ్చర్యంగా చూస్తున్నారు.
ఇండస్ట్రీలో అడుగు పెట్టి నాలుగు దశాబ్దాలు దాటినా ఏ మాత్రం జోరు తగ్గలేదు. ఈ స్థాయిలో సినిమాలు చేయడం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. చిరంజీవితో పాటు ఇతర సీనియర్ స్టార్ హీరోలు సైతం మమ్ముట్టీ కంటే జూనియర్స్ అనే విషయం ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉంది. మమ్ముట్టీ ఈ వయసులోనూ ఇంత గుడ్ లుకింగ్‌గా, ఫిట్‌గా ఉండటంను ఆదర్శంగా తీసుకుని యంగ్ హీరోలు ఇప్పటి నుంచి మంచి అలవాట్లను అలవర్చుకోవాల్సిన అవసరం ఉంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగులోనూ మమ్ముట్టీకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన నటించిన ఎన్నో సినిమాలు తెలుగులో విడుదల అయ్యాయి. డబ్బింగ్ సినిమాలతోనే కాకుండా కొన్ని డైరెక్ట్ సినిమాలతోనూ మమ్ముట్టీ తెలుగు ప్రేక్షకులను పలకరించారు. 1992లో స్వాతి కిరణం సినిమాలో మమ్ముట్టి నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. 20219లో యాత్ర, 2024లో యాత్ర 2 సినిమాలు విడుదల అయ్యి రాజశేఖర్ రెడ్డిగా తెలుగు ప్రేక్షకులను అలరించారు. మమ్ముట్టీ కి ఇంకా ఎన్నో తెలుగు సినిమా ఆఫర్లు వచ్చాయి. కానీ ఆయన మాత్రం చాలా అరుదుగా మాత్రమే తెలుగు సినిమాలు చేశారు. ఆయన నుంచి ముందు ముందు తెలుగు సినిమాలు వస్తాయా అనేది చూడాలి.