ఎరక్కపోయి ఇరుక్కుపోవడం అంటే ఇదే. కొన్నిసార్లు కామెంట్ చేసే ముందు చాలా విశ్లేషించుకోవాలి. తాను ఒక హిందీ హీరోనని సౌత్ లో నటించే ఛాన్సే లేదని టోటల్ సౌత్ పరిశ్రమనే కించపరిచాడు. సౌత్ లో తనకు మార్కెట్ అవసరం లేదన్న తీరుగా మాట్లాడాడు జాన్ అబ్రహాం. ఓవైపు పాన్ ఇండియా సినిమాల వెల్లువ కొనసాగుతుండగా జాన్ భాయ్ మాట అపరిపక్వంగా కనిపించింది. తాను నటించిన ఎటాక్ చిత్రం రిలీజ్ కి రెడీ అయిన వేళ అతడు ఇలా ప్రవర్తించాడు.
అయితే దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. సౌత్ సినిమాని చిన్న చూపు చూసిన జాన్ అబ్రహాం తన సినిమాతో సత్తా చాటాలని దెప్పి పొడిచారు. అయితే జాన్ భాయ్ అది చేయగలిగాడా? అంటే ఏమీ చేయలేక చేతులెత్తేశాడు. జాన్ అబ్రహం నటించిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రం `ఎటాక్: పార్ట్ 1` బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితం అందుకోలేదు. ఈ సినిమా కలెక్షన్లు కేజీఎఫ్ 2 - ఆర్.ఆర్.ఆర్ ముందు చిన్నబోయాయి. ఇప్పుడు ఏకంగా ఆ రెండు సినిమాలు ఇంకా థియేటర్లలో ఆడుతుండగానే .. మే 27న ఎటాక్ OTT ప్రీమియర్ కు రెడీ అవుతోంది.
ఎటాక్ అనేది హై-ఆక్టేన్ యాక్షన్ - రొమాన్స్ - డ్రామాతో కూడిన మొదటి భారతీయ సూపర్ సోల్జర్ చిత్రం. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ - రకుల్ ప్రీత్ ఇందులో కథానాయికలుగా నటించారు. ఈ చిత్రానికి లక్ష్య రాజ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. సుమిత్ బతేజా - విశాల్ కపూర్ లతో పాటు లక్ష్య కూడా ఈ చిత్రానికి సహ రచయితగా ఉన్నారు. ఈ సందర్భంగా జాన్ మాట్లాడుతూ.. భారతదేశపు తొలి సూపర్ సోల్జర్ గా రూపొందిన ఒకానొక చిత్రం కాబట్టి ఎటాక్ నాకు ఎప్పుడూ ప్రత్యేకమే. ఇది మన మాతృభూమి నుండి వచ్చిన ప్రామాణికమైన కథ. ప్రపంచంలోని అత్యుత్తమ యాక్షన్ చిత్రాలు... ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఉన్న యాక్షన్ ప్రియులకు చేరువయ్యేలా చేయడంలో మాకు ZEE5 మద్దతు ఉన్నందుకు నేను సంతోషిస్తున్నాను.. అని చివరికి జీ5 కాళ్లా వేళ్లా పడ్డాడు. థియేట్రికల్ గా ఫెయిలైన ఈ చిత్రాన్ని ఇక ఓటీటీలో వీక్షించాల్సిందే.
ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ అర్జున్ షెర్గిల్ కథను తెరపై నేరేట్ చేస్తుంది. అతను తీవ్రవాద దాడి తర్వాత శాశ్వత పక్షవాతానికి గురవ్వడంతో మూవీ ముగుస్తుంది. అతని ప్రియురాలిగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటించింది. అయేషాతో సహా అతనికి ప్రియమైన ప్రతి ఒక్కరినీ అతడు చివరికి కోల్పోతాడు. భారత సైన్యంలో కొత్తగా ప్రవేశపెట్టిన అత్యున్నత సాంకేతికతతో కూడుకున్న ఇంటెలిజెన్స్ రోబోటిక్ అసిస్టెంట్ (ఐఆర్‌ఎ) చిప్ తో అర్జున్ మళ్లీ తన కాళ్లపై నిలబడగలుగుతాడు. రకుల్ ప్రీత్ రాసిన సబాహా రూపొందించి అమర్చిన చిప్ అది. పార్లమెంటుపై దాడి నేపథ్యంలో దేశ ప్రధానిని కాపాడడమే ధ్యేయంగా అతడు కనిపిస్తాడు.
దర్శకుడు లక్ష్య రాజ్ ఆనంద్ మాట్లాడుతూ, -భారతదేశం లో పాపులరైన స్వదేశీ OTT ప్లాట్ ఫారమ్ ZEE5 లో మా చిత్రం ఎటాక్ సెకండ్ ఇన్నింగ్స్ రన్ అవుతుంది. భారతదేశపు మొదటి సూపర్ సైనికుడి హృదయం,- రక్తం,- చెమట -కన్నీళ్లతో తీసిన చిత్రమిది. మా కృషి మరింత ఎక్కువ మందికి చేరుతుందని ఆశిస్తున్నాము. డిజిటల్ ప్రీమియర్ ద్వారా అందరినీ పూర్తిగా అలరిస్తుంది. దాడికి సిద్ధంగా ఉండండి`` అని తెలిపారు. జయంతిలాల్ గడా పెన్ స్టూడియోస్- జాన్ అబ్రహం యొక్క JA ఎంటర్ టైన్ మెంట్ -అజయ్ కపూర్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రం మే 27న OTT ప్లాట్ ఫారమ్ ZEE5లో విడుదల కానుంది. ఓటీటీ రిలీజ్ సందర్భంగా జాన్ భాయ్ కానీ చిత్రదర్శకుడు కానీ మాట్లాడుతూ .. కనీసం ఓటీటీలో అయినా మా చిత్రం ప్రేక్షకులకు చేరువవుతుందని బేలగా చెప్పుకోవాల్సి వచ్చింది. నిజానికి ఈ మూవీ కంటెంట్ బావున్నా కానీ ఆర్.ఆర్.ఆర్ ప్రభావంతో చేతులెత్తేసిందన్న టాక్ అప్పట్లో వినిపించింది.