బాహుబలి 2 సినిమా విడుదలై ఐదు వారాలు దాటినా ఇప్పటికీ తన హోరు కొనసాగిస్తుంది. 1500 కోట్లు నుండి 1700 కోట్లు బెంచ్ మార్క్ ను దాటింది. ప్రపంచవ్యాప్తంగా బాహుబలి 2 చేస్తున్న గర్జనకు అమీర్ ఖాన్ దంగల్ కూడా విలవిలలాడి పోయిందంతే. భారత సినీ చరిత్ర లోనే ఇటువంటి కలెక్షన్లు రావడం ప్రథమం.
కానీ దంగల్ సినిమా చైనా లో విడుదలై 1000 కోట్ల మార్క్ దాటి రికార్డు సృష్టించింది. ఒక భారత దేశ సినిమా చైనా లో విడుదలై ఇంతటి విజయం సాధించడం దంగల్ సినిమాకే దక్కింది. వరల్డ్ వైడ్ కలెక్షన్ లో బాహుబలిని దంగల్ బీట్ చేస్తోంది కాని.. బాహుబలి 2 ఇంకా చైనా లో విడుదల కాలేదు. విడుదలైతే అక్కడకూడ దంగల్ రికార్డును దాటి మరో సంచలన రికార్డు చేయగలదు. అయితే బాహుబలి1 అక్కడ ఫ్లాప్ కావడంతో ఇప్పుడు దాన్ని ప్రభావం ఏమైనా ఉంటుందో ఏమోనని చిత్ర నిర్మాణ సంస్థ కాస్త భయపడుతోందట. ఇండియాలో అయితే బాహుబలి బెదురు లేకుండా దూసుకుపోయింది. దేశం అంతటా బాహుబలి1 మేకింగ్ కానీ ఆ సినిమా పాత్రలు కానీ చాలా క్రేజ్ సంపాదించాయి. ముఖ్యంగా ‘వై కట్టప్ప కిల్డ్ బాహుబలి ?’ ప్రశ్న ఒక ట్రేడ్ మార్కెటింగ్ చేసింది. మొదటి పార్ట్ విడిచిన థ్రిల్ బాహుబలి 2 కు బాగా ఉపయోగపడింది. దానికి తగినట్లే రాజమౌళి తన మేకింగ్ ప్రతిభతో అందరినీ మైమరిపించేలాగా చేశాడు. కాని చైనాలో సీన్ వేరే.
మొదటి పార్టు డిజాష్టర్ అయిపోయింది అక్కడ. అందుకే ఇప్పుడు బాహుబలి 2 సినిమాను చైనా లో ఎటువంటి భారీ అంచనాలుకు తావు ఇవ్వకుండా పక్క ప్లాన్ తో విడుదల చేసి అక్కడ కూడా హిట్ కొట్టే ప్రయత్నం చేస్తున్నారట. బహుశా రాజమౌళి అక్కడికెళ్ళి ప్రచారం కూడా చేసే ఛాన్సుందని అంటున్నారు. లెటజ్ సీ.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/