బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు.. అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలని దేశవ్యాప్తంగా చాలా కుతూహలంగా ఉన్నారు అభిమానులు. ఐతే రాజమౌళి తీరు చూస్తుంటే మాత్రం ఈ ఏడాది ఆ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడం కష్టమే అనిపిస్తోంది. నాలుగు నెలల నుంచి ఈ సినిమా ప్రి ప్రొడక్షన్ పనుల్లోనే బిజీగా ఉన్నాడు జక్కన్న. రామోజీ ఫిలిం సిటీలో డిసెంబర్ లో షూటింగ్ మొదలైందని అన్నారు కానీ.. నిజానికి అక్కడ షూటింగేమీ జరగలేదని తర్వాత వెల్లడైంది. జస్ట్ లొకేషన్ లు ఫైనలైజ్ చేయడం.. సెట్టింగులు చూసుకోవడంతోనే రాజమౌళిగా బిజీగా గడిపేశాడు. ప్రధాన పాత్రధారులైన ప్రభాస్ - రానా - అనుష్క ఇంకా ‘బాహుబలి’ కోసం రెడీ కాలేదని.. వారిని వేరే కార్యక్రమాల్లో చూస్తుంటేనే అర్థమైంది.
ఫిబ్రవరిలోనే కేరళ షెడ్యూల్ మొదలవుతుందని.. అక్కడే యూనిట్ సభ్యులంతా కలుస్తారని, ఈ షెడ్యూల్ సుదీర్ఘంగా సాగుతుందని వార్తలొచ్చాయి. ఐతే ఇప్పుడేమో సడెన్ గా బాహుబలి యూనిట్ నుంచి మరో రకమైన వార్త బయటికి వచ్చింది. దీని ప్రకారం బాహుబలి-2 కేరళ షెడ్యూల్ అప్పుడే పూర్తయిపోయిందట. కేరళలో ప్రధాన పాత్రధారుల మధ్య కొన్ని సన్నివేశాలతో షెడ్యూల్ ముగించేశారని.. దీని తర్వాత కొంచెం గ్యాప్ తీసుకుని, అమెరికా షెడ్యూల్ మొదలుపెట్టబోతున్నారని అంటున్నారు. ఐతే ఇప్పటిదాకా ప్రధాన పాత్రధారుల మీద ఒక్క సన్నివేశం కూడా తీయలేదని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. అసలు సినిమాకు సంబంధించి అసలైన షెడ్యూల్ ఫిబ్రవరిలోనే మొదలు కావచ్చని అంటున్నారు. మరి నిజంగా బాహుబలి-2 విషయంలో ఏం జరుగుతోందో?