మూడేళ్లుగా ఎదురు చూస్తున్న సినిమా రెండు రోజుల్లోనే విడుదల కాబోతోంది. అమెరికా నుంచి అమలాపురం దాకా భారతీయులంతా 'బాహుబలి' జపమే చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో బాహుబలి పిచ్చి పీక్స్‌కి చేరింది. యేళ్ల తరబడి థియేటర్‌కి వెళ్లనివాళ్లుకూడా బాహుబలి సినిమాని చూడాలని ప్లాన్ చేసుకొంటున్నారు. దీంతో థియేటర్ల దగ్గర అడ్వాన్సు బుక్కింగుల సందడి నెలకొంది. వారం రోజులుగా ఆన్‌లైన్‌లో బాహుబలి టిక్కెట్ల వ్యాపారం జరుగుతోంది. సినిమా ఇక రెండు రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు వస్తుండడంతో బుధవారం థియేటర్ల దగ్గర క్యూ లైన్లు కనిపించాయి. ప్రసాద్ ఐమ్యాక్స్ థియేటర్ దగ్గర రోడ్లపై బారులు తీరి కనిపించారు బాహుబలి అభిమానులు. మిగతా మల్టీప్లెక్స్‌ల దగ్గర కూడా బాహుబలి టిక్కెట్ల కోసం ఆరా తీస్తూ కనిపించారు ప్రేక్షకులు.
సినిమా పరిశ్రమలో ఉన్న సెలబ్రిటీలు కూడా బాహుబలి క్రేజ్ చూసి ఆశ్చర్యపోతున్నారు. సెలబ్రిటీలకు వాళ్ల బంధువులు ఫోన్లు చేసి బాహుబలి టిక్కెట్లు ఇప్పించమని కోరుతున్నారట. దీంతో పలువురు సినిమా సెలబ్రిటీలు ఆ విషయాన్ని ట్విట్టర్‌లో చెప్పుకొంటున్నారు. 'సినిమా సెలబ్రిటీ అయ్యి కూడా బాహుబలి టిక్కెట్లు ఇప్పించలేవా?' అని అడుగుతున్నారని కొంతమంది ట్వీట్లు చేశారు. దీన్నిబట్టి బాహుబలి పిచ్చి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదివరకు ఏ తెలుగు సినిమాకీ కనిపించనంత స్పందన బాహుబలి విషయంలో కనిపిస్తోంది. చూస్తుంటే సినిమా కనీవినీ ఎరుగని స్థాయిలో విజయవంతమైయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది.