అక్టోబర్‌ 25న ఇంటికొస్తున్న బాహుబలి

Update: 2015-09-29 11:30 GMT
బుల్లితెరపై రికార్డులు దులిపేందుకు వచ్చేస్తున్నాడు బాహుబలి. దశాబ్దాల తరబడి థియేటర్ల మొహం చూడనోళ్లని కూడా.. రప్పించిన ఘనత బాహుబలిది. ఇప్పుడు టీవీల్లోనూ సేమ్ సీన్ రిపీట్ అయ్యే అవకాశముంది. ఇవాల్టి రోజుల్లో టీవీ చూడని వాళ్లు పెద్దగా ఉండకపోయినా.. కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్ లు పెరిగాక.. కాస్త ఇంట్రస్ట్ తగ్గిందనే చెప్పాలి. కానీ బాహుబలి విషయంలో ఇవన్నీ తుడిచిపెట్టుకుపోయి.. ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోవడం ఖాయంగా కనిపిస్తోంది.

బాహుబలి టెలికాస్టింగ్ రైట్స్ దక్కించుకున్న మాటీవీ దసరా పండక్కి.. టెలికాస్ట్ చేయబోతోంది. ఇందుకోసం 15 రోజుల ముందునుంచే హైప్ పెంచేందుకు ప్లాన్ చేసేంది. ఇందులో భాగంగా తమ దగ్గర రైట్స్ ఉన్న రాజమౌళి సినిమాలను వరుసగా ప్రసారం చేయనుంది. ఈనెల పదిన ఛత్రపతి -  11న విక్రమార్కుడు - 17న మర్యాద రామన్న - ఆదివారమైన 18న ఈగ - యమదొంగ - 24న మగధీరలను ప్రసారం చేయనుంది. మూవీతోపాటే.. బాహుబలికి సంబంధించిన ఇప్పటివరకూ చేసిన మాటీవీ చేసిన కార్యక్రమాలు, ఇంటర్వ్యూ ల నుంచి హైలైట్స్ ను బ్రేక్ లలో ప్రసారం చేయనున్నారు.

ఇక అక్టోబర్ 24న  రాత్రి ఏడున్నరకి రాజమౌళి - ప్రభాస్ - రాణా సహా ప్రధాన తారాగణం అంతా పాల్గొన్న బాహుబలి కర్టెన్ రైజర్ ను టెలికాస్ట్ చేయబోతోంది మాటీవీ. ఆఖరున అక్టోబర్ 25న సాయంత్రం ఆరింటికి బాహుబలిని ప్రసారం చేస్తారు. మూవీ బ్రేక్ సమయాల్లో కూడా బాహుబలి మేకింగ్ సంగతులను తెలియచేయనున్నారు. మొత్తానికి బాహుబలిని అడ్డం పెట్టుకుని మాటీవీ 15 రోజుల పెద్ద ప్రణాళిక సెట్ చేసేసింది. ఇప్పటివరకూ సినిమాలకు దూరంగా ఉన్న అనేకమంది కూడా.. టీవీలో ప్రసారమయ్యేప్పుడు చూసే అవకాశం ఉంది.
Tags:    

Similar News