బాల‌య్య ఈసారి కాక‌తీయుల కాలంలోకి!

Update: 2016-02-01 09:30 GMT
బాల‌కృష్ణ - సింగీతం శ్రీనివాస‌రావు క‌ల‌యిక‌లో ఇదివ‌ర‌కు వ‌చ్చిన ఆదిత్య 369 ఓ టెక్నిక‌ల్ వండ‌ర్‌ గా నిలిచిన విష‌యం తెలిసిందే. అప్ప‌ట్లోనే సాంకేతికత‌ను అద్భుతంగా వినియోంచుకొని  ప్రేక్ష‌కుల్ని మెప్పించారు. అయితే ఆ సినిమాకి శ్రీకృష్ణ‌దేవ‌రాయ‌ల కాలానికి సంబంధించిన ఎపిసోడే హైలెట్‌గా నిలిచింది. క‌థానాయ‌కుడు టైమ్ మెషీన్‌ లోకి వెళ్ల‌గానే కాలం రివ‌ర్స్ అయిపోతుంద‌న్న‌మాట‌. ఆ ర‌కంగా బాల‌కృష్ణని తెర‌పై శ్రీకృష్ణ‌దేవ‌రాయ‌లుగా చూపించాడు సింగీతం. ఆ చిత్రం గురించి ఇప్ప‌టికీ మాట్లాడుకొంటున్నాం. అయితే ఇప్పుడు ఆదిత్య 369కి కొన‌సాగింపుగా ఆదిత్య 999ని తెర‌కెక్కించేందుకు స‌న్నాహాలు మొద‌ల‌య్యాయి. ఇప్ప‌టికే సింగీతం బౌండెడ్ స్క్రిప్టుని త‌యారు చేశాడని బాల‌య్య చెప్పుకొచ్చాడు. విశ్వ‌స‌నీయ స‌మాచారం మేర‌కు కొత్త సినిమాలో  టైమ్ మెషీన్  కాక‌తీయుల కాలంలోకి తీసుకెళుతుంద‌ట‌. బాల‌కృష్ణ ఈసారి గోన గ‌న్నారెడ్డిగా క‌నిపిస్తాడ‌ట‌. కాక‌తీయ చ‌రిత్ర‌లో గోన గ‌న్నారెడ్డికున్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. బందిపోటుగా ఆయ‌న గ‌డ‌గ‌డ‌లాడించాడు. సామాన్య జ‌నం కోసం పాటు ప‌డిన నాయ‌కుడిగా గుర్తింపు తెచ్చుకొన్నాడు. ఆ పాత్ర‌లోని వీర‌త్వం న‌చ్చే అల్లు అర్జున్ రుద్ర‌మ‌దేవిలో  గోన గ‌న్నారెడ్డి పాత్రని చేశాడు. ఈసారి బాల‌కృష్ణ‌నీ ఆ పాత్ర‌లో చూపించేలా సింగీతం ప్ర‌ణాళిక‌లు రూపొందించుకొన్నార‌ని తెలిసింది. అల్లు అర్జున్ ఆ పాత్ర‌తో మంచి పేరు తెచ్చుకొన్నాడు. మ‌రి బాల‌య్య ఎలా అద‌ర‌గొడతాడో చూడాలి. ఏరోస్ సంస్థ నిర్మించ‌నున్న ఆదిత్య 999ని త్వ‌ర‌లోనే ప‌ట్టాలెక్కించేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. క‌థానాయిక‌గా అంజ‌లి న‌టించే అవ‌కాశాలున్న‌ట్టు తెలిసింది.
Tags:    

Similar News